Telugu News Health Eat these seven types of anti aging superfoods keeps you young Telugu Health News
7 Superfoods: వృద్ధాప్య చాయలు దూరంగా ఉంచాలంటే.. ఈ ఏడు రకాల సూపర్ ఫుడ్స్ తిని చూడండి..
వయసు పెరిగే కొద్దీ మనలో వేగం తగ్గుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి మన శరీర భాగాలు కూడా అలసిపోతాయి. వయసును ఆపలేము, కానీ శరీరం వృద్ధాప్యానికి చేరుకునే వేగాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం.
Foods for Longevity: వయసు పెరిగే కొద్దీ మనలో వేగం తగ్గుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి మన శరీర భాగాలు కూడా అలసిపోతాయి. వయసును ఆపలేము కానీ శరీరం వృద్ధాప్యానికి చేరుకునే వేగాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. వృద్ధాప్య ప్రక్రియ స్లో చేయాలంటే కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సూపర్‌ఫుడ్స్ అనేవి శరీరానికి పోషకాలు అందిస్తుంటాయి. ఇవి అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, 50 ఏళ్లు పైబడిన వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని రుజువు చేశాయి. సూపర్‌ఫుడ్‌లు ఇమ్యూనిటీ బూస్టర్‌లు అని చెప్పవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అలాంటి 7 రకాల సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
బ్లూబెర్రీస్:ఇందులో ఫైబర్, మాంగనీస్, విటమిన్ K, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ రక్తపోటును తగ్గించి గుండె జబ్బులను నివారిస్తాయి.
సిట్రస్ పండ్లు:నారింజ, బత్తాయి లాంటి పండ్లలో ఫ్లేవనాయిడ్‌లతో పాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కాలేయం, కళ్ళు, మూత్రపిండాల కోసం వీటిని తీసుకోవాలి. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ జాబితాలో చేర్చారు.
ఆకు కూరలు:మీరు ఆకు పచ్చని సూపర్‌ఫుడ్‌లను తినాలనుకుంటే, బచ్చలికూర అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. కెరోటినాయిడ్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సాల్మన్ చేపలు: సాల్మన్, ట్రౌట్, హెర్రింగ్ వంటి చేపలలో అధిక స్థాయిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్.డీఎల్ అందిస్తుంది. సడెన్ గా వచ్చే హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
డ్రై ఫ్రూట్స్:వాల్‌నట్‌లు, బాదం వంటి గింజలు ప్రోటీన్‌కు మంచి మూలం. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులను కూడా కలిగి ఉంటాయి, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
కూరగాయలు: బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, అవకాడో వంటి కూరగాయలు ఫైబర్ కు అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు. ఇందులో ఇండోల్స్, నైట్రైల్స్, థియోసైనేట్‌ల వంటి ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటాయి.
గింజలు: పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, చియా విత్తనాలు, అవిసె గింజలు మీరు స్నాక్స్‌గా తీసుకోగల కొన్ని ఆరోగ్యకరమైన ఎంపికలు.వీటిని తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)