Mental Health : మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పక తినాల్సిందే..!!

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దానిని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి.

Mental Health : మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పక తినాల్సిందే..!!
Mental Health

Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2023 | 7:14 PM

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దానిని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఆందోళన ఉండకూడదు. అందుకు మనం తీసుకునే ఆహారం బాధ్యత వహిస్తుంది. సమతుల్య ఆహారం తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తినే ఆహారం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానిక కౌన్సెలింగ్, మందులు, ఆసుపత్రుల్లో చేరడం వంటివి చేస్తుంటారు.

అయితే న్యూట్రిషనల్ సైకియాట్రీ లోవ్ నీత్ బాత్రా మన మానసిక ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం గురించి వివరించింది. మనం తీసుకునే ఆహారం..మనశరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే మన మెదడును కూడా ప్రభావితం చేస్తుందని తెలిపింది. మానసిక ఆరోగ్య రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఆహారం, జీవనశైలి మార్పులు తీసుకువస్తుందని వివరించింది. కారణం లేకుండా చిరాకు పడటం, చెడు మానసిక కల్లోలంతో పోరాడటం ఇదంతా కూడా సెరోటోనిన్ లోపానికి సంకేతమని వెల్లడించింది.

సెరోటోనిన్ అనే ఆమైనో ఆమ్లం…మానసిక స్థితితోపాటు మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభవాన్ని చూపుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే మీకు సహాయపడే 7 సెరోటోనిన్ రిచ్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి
  1. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. మన శరీరం ట్రిఫ్టోఫాన్ ని 5-HTPని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్‌లను తయారు చేస్తుంది. ఈ రెండూ కూడా మానసిక స్థితిని మెరుగుపరచడంతోపాటు, అధిక నిద్రను నియంత్రించే, న్యూరోట్రాన్స్‌మిటర్‌లను చేస్తాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అరటిపండు తీసుకోవాల్సిందే.
  2. బాదంలో ఫోలేట్ ,మెగ్నీషియంతోపాటు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం అనేది సెరోటోనిన్ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మీ మెదడులో సంతోషాన్ని కలిగించే భావాలకు ప్రధాన దోహదపడుతుంది. బాదంపప్పులో విటమిన్లు B2, E కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడి సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడతాయి.
  3.  పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసే అమైనో ఆమ్లం. తద్వారా నిద్ర విధానాలు, మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  4. మెదడులో సెరోటోనిన్‌ను పెంచడానికి పైనాపిల్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అదనంగా, పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇందులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది.
  5. సోయా ఉత్పత్తుల్లో కూడా ట్రిప్టోఫాన్ యొక్క గొప్ప వనరులు ఉంటాయి.
  6. విటమిన్ బి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆవేశం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..