Pure Honey Test: క‌ల్తీ తేనెని ఇట్టే గుర్తించే అగ్గిపుల్ల టెస్ట్! ఇలా చేస్తే 5 నిమిషాల్లో తేలిపోతుంది!

తేనెలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు నిలయం. పలు అనారోగ్యాలను తగ్గించడంలో, శరీరానికి శక్తినివ్వడంలో తేనెకు అధిక ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ఔషధంగా వాడతారు. అయితే ప్రస్తుత తరుణంలో మార్కెట్లో కల్తీ తేనె ఎక్కువైంది. కేవలం కొన్ని సూచనలు పాటిస్తే స్వచ్ఛమైన తేనె, నకిలీ తేనె మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో చూద్దాం..

Pure Honey Test:  క‌ల్తీ తేనెని ఇట్టే గుర్తించే అగ్గిపుల్ల టెస్ట్! ఇలా చేస్తే 5 నిమిషాల్లో తేలిపోతుంది!
Ways To Spot Adulterated Honey

Updated on: Dec 13, 2025 | 3:47 PM

తేనె వాడకం పెరగడంతో వ్యాపారులు లాభాల కోసం కల్తీకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు స్వచ్ఛమైన తేనె ఏది, నకిలీ తేనె ఏది అని తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఆరోగ్య రక్షణ కోసం మనం కొనుగోలు చేసిన తేనె అసలైనదేనా అని తెలుసుకునేందుకు ఇక్కడ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు చూడండి. మీ ఆరోగ్యంపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడండి.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

తేనెను తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, పోష‌కాలకు తేనె గొప్ప ఆధారం. ప‌లు అనారోగ్యాల‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంలో తేనెకు ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను ఔష‌ధాల‌తో ఇస్తారు. అయితే, తేనె వాడ‌కం పెర‌గ‌డంతో వ్యాపారులు లాభం కోసం దాన్ని క‌ల్తీ చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. స్వచ్ఛ‌మైన తేనె ఏది, న‌కిలీ తేనె ఏది అని గుర్తించ‌డం సామాన్య ప్రజలకు కష్టతరం అయింది. అయినా కొన్ని సులభ ప‌ద్ధ‌తులు పాటిస్తే న‌కిలీ తేనెను వెంటనే తెలుసుకోవచ్చు.

నీటిలో వేసి చూడండి

మీరు కొన్న తేనె అస‌లుదో, న‌కిలీదో గుర్తించ‌డానికి సుల‌భ‌మైన చిట్కా ఉంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని గ్లాసు నీటిలో వేయాలి. న‌కిలీ తేనె అయితే త్వ‌ర‌గా నీటిలో క‌రుగుతుంది. అస‌లు తేనె మాత్రం గ్లాసు అడుగు భాగంలోకి చేరుతుంది. నీటిలో అంత త్వ‌ర‌గా క‌లవ‌దు.

అగ్గిపుల్ల ప‌రీక్ష

ఒక కాట‌న్ బాల్ తీసుకుని తేనెలో ముంచండి. అనంత‌రం దానికి అగ్గిపుల్ల‌తో నిప్పు పెట్టాలి. అస‌లు తేనె అయితే కాట‌న్ బాల్ మండుతుంది. న‌కిలీ తేనె మాత్రం మండ‌దు.

గోరుపై తేనె చుక్క

తేనె చుక్క‌ను గోరుపై వేయండి. ఆ చుక్క గోరుపై అటు ఇటు క‌దిలితే అది న‌కిలీ తేనె. అదే ఆ చుక్క క‌ద‌ల‌కుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను అస‌లైందిగా గుర్తించాలి.

వెనిగర్ తో నురుగు పరీక్ష

సాధార‌ణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి, చక్కెర వంటి ప‌దార్థాలు వాడి నకిలీ తేనెను త‌యారు చేస్తారు. కొద్దిగా తేనె తీసుకుని, దానికి 2, 3 చుక్కల వెనిగర్ ఎస్సెన్స్ కలపాలి. వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్ర‌మం ఎక్కువగా నురగను ఇస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి. నకిలీ తేనెలో ఉండే చక్కెర వెనిగర్‌తో కలిసినప్పుడు నురగ వ‌స్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వ‌దు.

తేనె గడువు తేదీ

సాధార‌ణంగా స్వ‌చ్ఛ‌మైన తేనెకు గ‌డువు తేదీ ఉండ‌దు. అయితే మార్కెట్‌లో ల‌భించే తేనెలో కొంద‌రు ర‌సాయ‌నాలు క‌లుపుతారు. అందుకే మనం కొనే తేనెకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. స‌హ‌జ‌సిద్ధంగా సేక‌రించిన తేనె ఎన్ని రోజులు ఉన్నా పాడ‌వ‌దు. రోజులు గ‌డిచే కొద్దీ ఇంకా రుచి పెరుగుతుంది. మార్కెట్‌లో తేనె కొంటే బ్రాండెడ్ కంపెనీల‌కు చెందిన‌ది ఎంచుకోవడం మంచిది. క‌ల్తీ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ ఉంటాయి. ఇలా ప‌లు సూచ‌నలు పాటిస్తే న‌కిలీ తేనెను గుర్తించ‌డంతోపాటు దాన్ని కొన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వచ్చు.