
చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణం ఊబకాయం. శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాల హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లే చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణం. ప్రస్తుతం పిల్లల్లో బరువు వేగంగా పెరగడం ఈ సమస్యను మరింత పెంచుతోంది.
చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి జబ్బుల రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.