శీతాకాలంలో పెరుగు లేదా రైతా.. ఏది బెటర్ అంటే?

శీతాకాలంలో సాధారణంగా చాలా మంది పెరుగు తీసుకోరు. మరికొందరు రైతాను ఆహారంలో తీసుకుంటారు. అయితే, ఈ కాలంలో ఈ రెండింటిలో ఏది ఆహారంగా తీసుకుంటే మంచిదనే సందేహం అందరిలో ఉంది. శాస్త్రీయం ప్రకారంగా చూస్తే శీతాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు బారిన పడే అవకాశం ఉండటంతో పెరుగు కంటే రైతాను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

శీతాకాలంలో పెరుగు లేదా రైతా.. ఏది బెటర్ అంటే?
Curd And Raita

Updated on: Dec 31, 2025 | 6:05 PM

మన శరీరానికి పెరుగు, రైతా అనే ఈ రెండు ఆహార పదార్థాలు కూడా మంచివే. అయితే, కాలాన్ని బట్టి రెండింటి ప్రాధాన్యత తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. ఈ రెండు కూడా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడున్న శీతాకాలంలో ఈ రెండింటిలో ఏది తీసుకుంటే శరీరానికి మంచిదనే విషయం తెలుసుకుందాం.

శరీరంపై పెరుగు ప్రభావం

మనం తీసుకునే సాదా పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధకను మెరుగుపరుస్తుంది. అయితే, శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కొంతమందికి పెరుగు తినడం మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా జలుబు, గొంతునొప్పి లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు పెరుగు తీసుకోవడం హానికరమనే చెప్పాలి. లేదంటే తీసుకునే పరిమాణాన్ని తగ్గించుకోవాలి.

రైతా ప్రభావం

రైతా అనేది శీతాకాలంలో సమతుల్య పెరుగు అని భావిస్తుంటారు. జీలకర్ర, నల్ల మిరియాలు, అల్లం, కొత్తిమీర లేదా కూరగాయలను పెరుగులో కలిపినప్పుడు దాని శీతలీకరణ ప్రభావం సమతుల్యం చెందుతుంది. జీలకర్ర, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్‌ను తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అందకే శీతాకాలంలో సాధారణ పెరుగు కంటే రైతా తీసుకోవడం ఉత్తమమని చెబుతుంటారు.

రైతానే బెటర్

శీతాకాలంలో తరచుగా జలుబు, దగ్గు బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి.. పెరుగుకు బదులుగా రైతాను తీసుకుంటే మన శరీరానికి మంచిది. జీర్ణ సమస్యలు ఉన్నవారు సులభంగా జీర్ణమయ్యే రైతాను తీసుకోవడం మేలు. ఇక, కూరగాయలతో చేసే రైతా రుచిని పెంచడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో తోడ్పడుతుంది. మధ్యాహ్నం భోజనంలో పెరుగు లేదా రైతా తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో మాత్రం ఈ రెండింటినీ తీసుకోకపోవడమే మంచిది. వీటితో జీర్ణక్రియ మందగిస్తుంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే శీతాకాలంలో పెరుగు కంటే రైతా తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చు.