Alcohol Side Effects: మనం తీసుకునే ఆహరం కావచ్చు, తాగే ద్రవాలు ఏవైనా కావచ్చు మితంగా తీసుకుంటే ఔషధం.. అమితంగా తీసుకుంటే విషం అంటుంటారుపెద్దలు. మద్యం సేవించడం అనేది చాలా మంది తెలిసి చేసే పెద్ద తప్పు. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా..? పెళ్ళైనా , చావైనా, పుట్టిన రోజైనా.. విషయం ఏదైనా మద్యం ఉండాల్సిందే అంటారు మందుబాబులు.. ఆల్కహాల్ తాగితే వచ్చే నష్టాల గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మద్యం తాగడం వల్ల కొన్ని వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది ఎక్కువైతేనే సమస్య. మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.
ఇదిలా ఉంటే మద్యం తాగడం వల్ల శరీర బరువు కూడా పెరుగుతుందట.. మద్యం తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రరాల్ స్థాయిలను పెంచడం, అధిక రక్తపోటును కలిగించడం, జీవనశైలి రుగ్మతలు, కాలేయ నష్టం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ మద్యం తాగేవారు బరువు పెరిగిపోతారు. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీరులో 150 కేలరీలు ఉంటాయి. హార్డ్ డ్రింక్స్‌లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర బరువు పెరగడానికి దారితీస్తాయి. అలాగే కొంతమంది మద్యం సేవించిన తర్వాత తియ్యటి పదార్ధాలు తినాలని అనుకుంటారు.. దాంతో మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడచదవండి :