Jamun Seeds: నేరేడు పండు తిని గింజలు పారేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

|

Jul 04, 2022 | 8:12 PM

జామూన్ విత్తనాలు కూడా మధుమేహ (Diabetes) రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే నేరేడు తింటే వాటి గింజలను పారేయవద్దని సూచిస్తున్నారు.

Jamun Seeds: నేరేడు పండు తిని గింజలు పారేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Jamun Seeds
Follow us on

Jamun Seed Benefits: వేసవిలో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. జామున్ పండు నుంచి గింజలు, ఆకులు.. బెరడు ఇవన్నీ ఆయుర్వేదంలోని అనేక ఔషధాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు నేరేడు చాలా ప్రయోజనకరమని నిపుణులు పేర్కొంటున్నారు. జామూన్ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పలు రకాల వ్యాధులు దూరం అవుతాయి. జామూన్ విత్తనాలు కూడా మధుమేహ (Diabetes) రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే నేరేడు తింటే వాటి గింజలను పారేయవద్దని సూచిస్తున్నారు. జామున్ గింజలను ఎండబెట్టి, పొడి చేసుకోని నిల్వ చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల మధుమేహానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. జామున్ విత్తనాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

జామున్ సీడ్ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు..

ఈ సీజన్‌లో జామూన్‌ను ఎక్కువగా తిని దాని గింజలను కడిగి ఉంచుకోవాలి. ఈ గింజలను ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేరేడు గింజలలో జంబోలిన్, జంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి చక్కెర విడుదలను నెమ్మదించేలా చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనానికి ముందు ఈ పొడిని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

జామున్ విత్తనాలతో పొడిని ఎలా తయారు చేయాలి

  • ముందుగా జామున్ గింజలను కడగాలి. జామున్ తినకపోతే గుజ్జును వేరు చేయండి.
  • ఇప్పుడు విత్తనాలను పొడి గుడ్డపై ఉంచి 3-4 రోజులు ఎండలో ఆరబెట్టండి.
  • విత్తనాలు ఎండిపోయి బరువు తక్కువగా ఉన్నట్లు అనిపించినప్పుడు, పైన సన్నని పొరను తొలగించండి.
  • ఈ గింజలను మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి.
  • జామున్ గింజల నుంచి పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే, ఉదయాన్నే పరగడుపున పాలతో ఈ పొడిని తీసుకోండి.
  • ఈ పొడిని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
  • జామూన్ గింజలు కడుపు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం