Calcium Rich Pulse: మీ పిల్లలు పాలు తాగేందుకు మారాం చేస్తున్నారా?.. అయితే ఈ పప్పు పొట్టు తినిపించండి..

|

Sep 12, 2022 | 11:01 AM

Toor Dal Seed Coat For Calcium: రక్తం గడ్డకట్టడం, కండరాలను బలోపేతం చేయడం.. గుండె కొట్టుకోవడం. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. మనం నిత్యం తాగే పాలలో కాల్షియం ఉంటుంది. అందుకే..

Calcium Rich Pulse: మీ పిల్లలు పాలు తాగేందుకు మారాం చేస్తున్నారా?.. అయితే ఈ పప్పు పొట్టు తినిపించండి..
Toor Dal Peeli
Follow us on

కాల్షియం మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎముకలు, దంతాలకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది. ఈ పోషకం లోపం ఉంటే.. శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. రోజంతా సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడం, కండరాలను బలోపేతం చేయడం.. గుండె కొట్టుకోవడం. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. మనం నిత్యం తాగే పాలలో కాల్షియం ఉంటుంది. అందుకే పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు ఈ పాలు తాగలని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ తాజా అధ్యయనంలో పప్పుపై ఉండే పొట్టులో కూడా చాలా కాల్షియం ఉన్నట్లు తేలింది. గత కొద్ది కాలంగా పప్పుపై నుంచి వేరు చేసిన పొట్టును పశుగ్రాసంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ICRISAT తాజా పరిశోధనల్లో..

పాలలో కంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం కందిపప్పులో ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, రికెట్స్‌ సమస్యను సరిచేయడంలో సహాయ పడుతుంది. ICRISAT(ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ )లో నిర్వహించిన తాజా పరిశోధన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరు జరిపిన పరిశోధనల ప్రకారం.. పాల కంటే కంది పప్పు పొట్టులో ఎక్కువ కాల్షియంను గుర్తించారు.

ఇది శిశువు ఆహారం, మినరల్ సప్లిమెంట్లకు ముఖ్యమైనదని నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కేవలం 100 గ్రాముల కంది పొట్టులో 652 మిల్లీగ్రాముల కాల్షియంను గుర్తించారు. అయితే 100 మిల్లీలీటర్ల పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉందని తేల్చారు. అయితే.. మన శరీరానికి ప్రతిరోజూ 800-1,000 mg కాల్షియం అవసరం. కాబట్టి మీరు తీసుకునే ఆహారం సరైన ఎంపికగా చెప్పవచ్చని ప్రకటించారు ఇక్రిశాట్ పరిశోధకులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..