Alcohol: చలేస్తోందని మందేస్తున్నారా.? అయితే బీకేర్‌ఫుల్ బ్రదరూ.!

| Edited By: Ravi Kiran

Nov 27, 2024 | 11:02 AM

బయటేమో చల్ల చల్లని.. కూల్.. కూల్.. ఇక ఈ చల్లదనానికి కాస్త పెగ్గు వేస్తే బాగుంటుందని మందుబాబులు అనుకుంటూ ఉంటారు. అయితే వారికి ఓ హెచ్చరిక ఇచ్చారు వైద్య నిపుణులు. అదేంటంటే..

Alcohol: చలేస్తోందని మందేస్తున్నారా.? అయితే బీకేర్‌ఫుల్ బ్రదరూ.!
Alcohol Drinking
Follow us on

తెలంగాణలో చలి-పులి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇదే అదనుగా ఫ్లూ వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. కాలనుగుణంగా వచ్చే ఫ్లూ వ్యాధులు ప్రబలడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. ఫ్లూ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తం కావాలని వైద్యారోగ్య శాఖ అలెర్ట్ నోటీస్ జారీ చేసింది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం వేళ 8 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అర్బన్ లో 8.3 డిగ్రీలు, మెదక్ జిల్లా కోహీర్ లో 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలి నుంచి రక్షించుకునేందుకు జనం నానా తంటాలు పడుతున్నారు. మద్యం ప్రియులు ఓ చక్కు ఎక్కువ వేస్తే చలి గిలి నై జాన్తా అంటున్నారు. కానీ ఇదే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది సాయంత్రం వేళ చలి తగిలిన తర్వాత మందు తాగే అలవాటు ఉన్నావారు రెగ్యులర్ గా చలి బారినుంచి తప్పించుకోవచ్చని ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు. శ్వాస కోశ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ వస్తే అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం లేదా పెదవుల నీలం రంగు, కఫంలో రక్తం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గాయని.. వెచ్చగా ఉంటుందని మద్యం సేవిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు. సో చలిగాలుల తీవ్రత తగ్గేవరకు బీ అలెర్ట్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి