Kitchen Hack: నోటి నుంచి దుర్వాసన వస్తుందా.. అయితే ఈ సారి ఇలా చేయండి!!

|

Sep 03, 2023 | 5:50 PM

చాలా మంది నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వారు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సమస్య తరచూ వారిని వేధిస్తూ ఉంటుంది. దీంతో ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దూరంగా ఉండి మాట్లాడుతూంటారు. దీంతో మౌత్ వాష్ లతో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం సంగతి పక్కన పెడితే.. దుష్ర్పభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మౌత్ వాష్ లలో ఉపయోగించే ఆల్కా హాల్ నోట్లో జిగురును..

Kitchen Hack: నోటి నుంచి దుర్వాసన వస్తుందా.. అయితే ఈ సారి ఇలా చేయండి!!
Mouth Wash
Follow us on

చాలా మంది నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వారు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సమస్య తరచూ వారిని వేధిస్తూ ఉంటుంది. దీంతో ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దూరంగా ఉండి మాట్లాడుతూంటారు. దీంతో మౌత్ వాష్ లతో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం సంగతి పక్కన పెడితే.. దుష్ర్పభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మౌత్ వాష్ లలో ఉపయోగించే ఆల్కా హాల్ నోట్లో జిగురును తక్కువ ఉత్తత్తి అయ్యేలా చేస్తుంది.

ఈ కారణంగా నోట్లో నోటి సమ్యలు ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మౌత్ వాష్ లలో ఉండే సోడియం లారిల్ సల్ఫేట్ కారణంగా తల నొప్పి వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇంటి చిట్కాలను ట్రై చేయండి. ఒకవేళ వీటి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే అప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పిప్పర్ మెంట్ ఆయిల్:

ఇవి కూడా చదవండి

మౌత్ వాష్ లకు బదులు పిప్పర్ మెంట్ ఆయిల్ ని వాడటం వల్ల మంచి ఫలితం చేస్తుంది. ఈ ఆయిల్ ను రోజూ 4 లేదా 5 చుక్కలను నీటిలో వేసుకుని.. ఆ నీటిని పుక్కలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే ఈ ఆయిల్ తో నోరు ఫ్రెష్ గా ఉంటుంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు.

టీ ట్రీ ఆయిల్:

ఈ టీ ట్రీ ఆయిల్ గురించి చాలా మందికి తెలుసు. నోటి దుర్వాసనను తగ్గించుకునేందుకు ఈ ఆయిల్ ను ఉపయోగించినా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆయిల్ ని కూడా నాలుగు లేదా 5 చుక్కలను నీటిలో వేసి.. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా.. తాజాగా ఉంటుంది.

మౌత్ వాష్ లకు బదులు ఇలా సహజ పద్దతులను ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్స్ తో దుష్ర్పభావాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి