Air Pollution: అధిక కాలుష్యం వల్ల పెరుగుతోన్న ఒత్తిడి.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!

| Edited By: Ravi Kiran

Nov 08, 2023 | 8:45 PM

రోజు రోజుకూ వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. వాయు కాలుష్యం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం మరింత వణికిస్తోంది. తాజాగా ఢిల్లీలోని ప్రజలను శ్వాస కోశ వ్యాధుల పెరుగుదల గురించి హెచ్చరించినట్లు పీటీఐ నివేదించింది. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రజలు అనేక సమస్యలకు గురవుతారని భయంకరమైన విషయాలను పేర్కొంది. తల నొప్పులు, ఆందోళన, ఒత్తిడి, చికాకు, అభిజ్ఞా సామర్థ్యం..

Air Pollution: అధిక కాలుష్యం వల్ల పెరుగుతోన్న ఒత్తిడి.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!
Pollution
Follow us on

రోజు రోజుకూ వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. వాయు కాలుష్యం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం మరింత వణికిస్తోంది. తాజాగా ఢిల్లీలోని ప్రజలను శ్వాస కోశ వ్యాధుల పెరుగుదల గురించి హెచ్చరించినట్లు పీటీఐ నివేదించింది. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రజలు అనేక సమస్యలకు గురవుతారని భయంకరమైన విషయాలను పేర్కొంది. తల నొప్పులు, ఆందోళన, ఒత్తిడి, చికాకు, అభిజ్ఞా సామర్థ్యం తగ్గడం, గందరగోళం వంటి కేసులు ఢిల్లీలో అకస్మాత్తుగా పెరగడం వలన పరిస్థితి కనిపించే దాని కంటే చాలా తీవ్రంగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడింది.

వాయు కాలుష్యం – మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశోధకులు. అధిక స్థాయి కాలుష్య కారకాలు.. ఒత్తిడి, ఆందోళన, నిరాశకు దోహం చేస్తుంది. ఫైన్ పర్టిక్యులేట్ పదార్థం రక్త ప్రవాహంలోకి ప్రవేశించి.. ముఖ్యంగా బ్రెయిన్ ని ప్రభావితం చేస్తుంది. అలాగే అభిజ్ఞా బలహీనతలకు దారి తీస్తుందన్నారు. గాలి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు మన శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కలుషిత వాతావరణంలో జీవించడం వల్ల కలిగే మానసిక ఆరోగ్య ప్రమాదాలను కూడా తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యంపై వాయు కాలుష్యం ఎలా ప్రభావితం చేస్తుందంటే:

ఇవి కూడా చదవండి

అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం.. కాలుష్యకరమైన గాలిని పీల్చడం వల్ల ఒక వ్యక్తిలో బైపోలార్ డిజార్డర్, స్కిజో ఫ్రెనియా, పర్సనాలిటీ డిజార్డర్, మేజర్ డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించింది.

మరొక అధ్యయనం.. విష పూరిత వాయు కాలుష్య కారకాలకు గురి కావడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, సైకోసెస్, డిమోన్షియం వంటి నరాల సంబంధిత పరిస్థితులు వంటి సమస్యలకు దారి తీస్తాయని చెబుతోంది. అలాగే పిల్లలు కూడా ఈ వయసులోనే వాయు కాలుష్యానికి గురి కావచ్చని కూడా గుర్తించబడింది. దీంతో వారి భవిష్యత్తులో మానసిక, ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. కాబట్టి వాయు కాలుష్యం పట్ల సరైన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.