Health Tips: టీ అలవాటు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుందా..? షాకింగ్‌ నిజం ఏంటో తెలుసుకోండి..

|

May 29, 2023 | 3:48 PM

చిన్నతనంలో టీ కావాలని అడిగినప్పుడు, టీ తాగడం వల్ల నువ్‌ నల్లగా అయిపోతావ్‌ అంటూ తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడతారు. ఈ భయం కారణంగా చాలా మంది పిల్లలు టీకి దూరంగా ఉంటారు. అయితే, టీ కి చర్మం రంగు మధ్య ఏదైనా సంబంధం ఉందా.. అనేది ఎప్పుడైనా తెలుసుకున్నారా..?

Health Tips: టీ అలవాటు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుందా..? షాకింగ్‌ నిజం ఏంటో తెలుసుకోండి..
Drinking Tea
Follow us on

మన దేశంలో నీళ్ల తర్వాత అత్యధికంగా వినియోగించబడే పానీయాలలో టీ ఒకటి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం అన్ని పనులు ముగించుకునే వరకు చాలా మంది చాలాసార్లు టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల కడుపునొప్పి, నిద్రలేమి, మధుమేహం వంటి అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. అయితే ఇది తాగడం వల్ల చర్మం నల్లబడుతుందని మీకు తెలుసా..? బాల్యంలో, టీ తాగకూడదని పిల్లలకు చెబుతారు. ఎందుకంటే అందులో కెఫీన్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలకు హానికరం అని చాలా పరిశోధనల్లో రుజువైంది. కానీ, అదే పిల్లలు పెద్దయ్యాక కూడా అది నిజమని చాలా మంది నమ్ముతారు. టీ తాగే అలవాటు లేకపోవటం మంచిదే కానీ, అనవసరంగా జీవితాంతం పుకార్లు మోయడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే.. టీ వల్ల చర్మం  నల్లబడుతుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మం రంగు మీ జన్యుశాస్త్రం, జీవనశైలి, బహిరంగ కార్యకలాపాలు, చర్మంలో మెలనిన్ ఉనికిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకపోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

టీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు..

* ఎక్కువ సార్లు కాఫీ తాగిన వారికి వయసు పెరిగే కొద్దీ కొన్ని రకాల వణుకు పుడుతుంది. టీ పౌడర్‌లో కెఫిన్ ఉండటం దీనికి ప్రధాన కారణం. కాబట్టి వీలైనంత వరకు టీ సిప్ చేయడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా, శరీరంలో టెన్షన్, అలసట వంటి లక్షణాలు కూడా సంభవించవచ్చు.

* టీలో సహజంగా కెఫిన్ ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్ర తీరుపై ప్రభావం చూపుతుంది. మెలటోనిన్ అనేది మన మెదడుకు నిద్రను చెప్పే హార్మోన్. కెఫిన్ మెలటోనిన్ చర్యను నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

* మితంగా టీ తాగడం లేదా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కడుపులో యాసిడ్ చర్యను పెంచుతుంది. కడుపుని చికాకుపెడుతుంది.

* మన శరీరం కెఫిన్‌ని సులభంగా గ్రహిస్తుంది. దీని వల్ల మెదడులో కొంత సమస్య వస్తుంది. కెఫీన్ మన మెదడులో కొన్ని కార్యకలాపాలను నిరోధిస్తుంది. ఇది మెదడు అదనపు డోపమైన్, మరియు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది.

* టీలో ఉండే కెఫిన్ తలనొప్పికి కారణమవుతుంది. మీరు రోజుకు చాలాసార్లు టీ తాగే అలవాటు కలిగి ఉంటే, అందులోని కెఫిన్ తలనొప్పిని పెంచుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల కెఫీన్ మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలను ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం