Sweaty Hands: మీకూ అరచేతులు చెమటలు పడుతున్నాయా? జాగ్రత్త.. ఈ ప్రాణాంతక వ్యాధి సంకేతం కావచ్చు

|

Feb 14, 2024 | 3:02 PM

ఒక్కోసారి ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే అరచేతులు చెమటలు పట్టుతుంటాయి. మీకూ తరచూ ఇలా అనిపిస్తుందా? చలికాలంలో కూడా ఈ సమస్య తలెత్తితే తేలిగ్గా తీసుకోకండి. మీ శరీరంలో కాలేయ వైఫల్యానికి ఇదొక సంకేతం కావచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అరచేతులపై తరచూ చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతం. ఈ సమస్య తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను..

Sweaty Hands: మీకూ అరచేతులు చెమటలు పడుతున్నాయా? జాగ్రత్త.. ఈ ప్రాణాంతక వ్యాధి సంకేతం కావచ్చు
Sweaty Hands
Follow us on

ఒక్కోసారి ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే అరచేతులు చెమటలు పట్టుతుంటాయి. మీకూ తరచూ ఇలా అనిపిస్తుందా? చలికాలంలో కూడా ఈ సమస్య తలెత్తితే తేలిగ్గా తీసుకోకండి. మీ శరీరంలో కాలేయ వైఫల్యానికి ఇదొక సంకేతం కావచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అరచేతులపై తరచూ చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతం. ఈ సమస్య తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను సులభంగా నయం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే అరచేతులకు చెమటలు పట్టడం ఫ్యాటీ లివర్‌కి సంకేతం అయినప్పటికీ, అయితే ఈ లక్షణాలు అన్ని సందర్భాల్లోనూ అందరికీ ఒకే విధంగా ఉండవని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో.. అరచేతులపై ఎక్కువగా సేబాషియస్ గ్రంధులు ఉండటం వల్ల కూడా చెమట కలుగుతుంది. దీని కారణంగా చర్మం జిడ్డుగా మారడం ప్రారంభమవుతుంది. ఫలితంగా అరచేతులు చెమటలు పడతాయి. ఇటువంటి సందర్భాల్లో డాక్టర్ చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అరచేతులలో చెమట పట్టే సమస్యను నియంత్రించే సేబాషియస్ గ్రంథులను నియంత్రించేందుకు వైద్యులు మందులు సూచిస్తారు.

పెరుగుతోన్న ఫ్యాటీ లివర్ కేసులు

నేటి కాలంలో ఫ్యాటీ లివర్ అనేది చాలా సాధారణ వ్యాధిగా మారుతోందని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ అజిత్ జైన్ చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్యకు తొలినాళ్లలో చికిత్స ద్వారా నయం చేయవచ్చు. కానీ అశ్రద్ధ చేస్తే లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. మద్యం తాగని వారు కూడా ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహార అలవాట్లు, పెరుగుతున్న ఊబకాయం. బరువు పెరిగే వారిలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.

ఎలా నివారించాలంటే?

డైట్‌ను కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్ జైన్ సూచిస్తున్నారు. ముందుగా ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. అయినా అజీర్ణం, కడుపులో అధిక గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.