Child Car: మీరు మీ పిల్లలను గమనిస్తున్నారా.. వారిలో ఈ లక్షణాలుంటే.. నులిపురుగులే కారణం కావొచ్చు..

|

Mar 08, 2022 | 5:10 PM

నులిపురుగులు సాధారణంగా చిన్న పిల్లల కడుపులో తయారవుతాయి. ఈ నులిపురుగులు  పిల్లల పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి...

Child Car: మీరు మీ పిల్లలను గమనిస్తున్నారా.. వారిలో ఈ లక్షణాలుంటే.. నులిపురుగులే కారణం కావొచ్చు..
Child
Follow us on

నులిపురుగులు(Worms) సాధారణంగా చిన్న పిల్లల(Child Health Car) కడుపులో తయారవుతాయి. ఈ నులిపురుగులు  పిల్లల పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ నులి పురుగులు పిల్లల కడుపులో చేరడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, సరిగా తినకపోవడం, వాంతులు(Vomiting), విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. చిన్నారులను పట్టి పీడించే అనారోగ్య సమస్యలను ఈ నులిపురుగుల సమస్య అనేది మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల పొట్టలో చేరడం వల్ల పిల్లలు పీల్చి పిప్పి చేస్తాయి. ఈ నులి పురుగుల వల్ల చిన్నారి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలలో నులి పురుగులు చేరడం వల్ల ఎదుగుదల ఆగిపోవడం.. ఆకలి మందగించడం.. పోషకాల కొరత.. తీవ్రమైన కడుపునొప్పి.. రక్తహీనత.. నీరసం.. బలహీనత.. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం.. అతిసారం.. ఏకాగ్రత లోపించడం ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి.

ఇకపోతే పిల్లల కడుపులో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత.. అందుకే ఇంటి పరిసరాలను ఇంటి ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు తినే ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చేసుకోవడంతోపాటు కంచాలు, గిన్నెలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇక పిల్లలకు ప్రతిరోజు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. సరిగ్గా ఉడకని ఆహారాన్ని పెట్టకూడదు. పిల్లలు శుభ్రంగా ఉండేలాగా వారిని చూసుకోవడంతో పాటు చేతి గోళ్లలో దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మలవిసర్జన తర్వాత భోజనానికి ముందు పిల్లల చేతులు తప్పని సరిగా శుభ్రం చేయాలి. చెప్పులు లేకుండా పిల్లలు బయటకు పంపించకూడదు. దానిమ్మ పండ్లు , స్వచ్ఛమైన తేనె, ఆహారాలు పిల్లలకు ఇవ్వవచ్చు. వెల్లుల్లి, పుదీనా, క్యారెట్, కీరదోస వంటి ఆహారాలు కూడా పిల్లలకు ఇవ్వాలి.

నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 1 -2 ఏండ్ల పిల్లలు 200 మిల్లీ గ్రాముల మాత్రలు, ఆపైబడిన వారు 400 మిల్లీ గ్రాముల మాత్రను వేసుకొని బాగా నమలాలి. కడుపులో నులి పురుగులు ఉంటే మాత్రలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. వీటిని ప్రతి ఆరునెలలకోసారి వేసుకోవడం వల్ల నులిపురుగులు తగ్గిపోతాయి.

Read Also.. Women’s Health Tips: పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా.? అయితే వీటిని తెలుసుకోవాల్సిందే..