
సాధారణంగా రోజుకు 10,000 అడుగులు నడవాలని చాలా మంది అనుకుంటారు. కానీ తక్కువ అడుగులు నడిచినా కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు అదనంగా 1,000 అడుగులు నడిచిన వారిలో గుండె సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.
ఎన్ని అడుగులు నడిచారనే దానికంటే ఎలా నడిచారనేది చాలా ముఖ్యం. రోజుకు అరగంట వేగంగా నడిచిన వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. వేగంగా నడవడం, చిన్న విరామాలతో క్రమం తప్పకుండా నడవడం వల్ల గుండెకు ఎక్కువ రక్షణ లభిస్తుంది.
10,000 అడుగులు నడవడం చాలా మంచిదే అయినా.. రోజుకు 2,500 నుండి 4,000 అడుగులు నడవడం కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు (High BP) ఉన్నవారికి రోజుకు 1,000 అడుగులు అదనంగా నడిచే అలవాటు చాలా ఉపయోగపడుతుంది.
నడక అనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గం అని నిపుణులు అంటున్నారు. రోజుకు 500 నుంచి 1,000 అడుగులతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. అలాగే వేగంగా నడవడం కూడా ముఖ్యమని వారు అంటున్నారు. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. తక్కువ సమయం నడిచినా వేగంగా నడిస్తే గుండె బలపడుతుంది. కాబట్టి 10,000 అడుగులు నడవకపోయినా.. రోజువారీ నడక అలవాటును తప్పకుండా కొనసాగించాలి.
వైద్య నిపుణులు చెప్పినట్లుగా.. ఆరోగ్యం కోసం ప్రతి అడుగు ముఖ్యం. 10,000 అడుగులు నడవలేకపోయినా.. రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీ రోజువారీ నడకను పెంచుకోవడం ద్వారా మీరు మరింత శక్తివంతంగా మారవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)