Green Peas Benefits: బఠానీలే కదా అని లైట్ తీసుకోకండి..లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

బఠానీ చాలా పోషకమైన కూరగాయ.. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ ఎముకలను స్టాంగ్‌గా చేస్తాయి. బఠానీ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే?

Green Peas Benefits: బఠానీలే కదా అని లైట్ తీసుకోకండి..లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Green Peas Benefits

Updated on: Dec 16, 2024 | 9:58 AM

చలికాలంలో చాలా తాజా పండ్లు, కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి సీజనల్ కూరగాయలు తినడం శరీరానికి మేలు చేస్తుంది. చలికాలంలో పచ్చి బఠానీలు మార్కెట్‌లో దొరుకుతాయి. ఈ పోషకమైన కూరగాయలు చలికాలంలో పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా, కొన్ని ప్రదేశాలలో దీనిని బఠానీలు అని కూడా పిలుస్తారు. అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్న బఠానీలను మనం రోజువారీ ఆహారంలో వివిధ వంటకాల్లో ఉపయోగించుకుని ఆహార రుచిని పెంచుకోవచ్చు. చలికాలంలో బఠానీలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బఠానీలను తొక్క తీసి ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే నెల రోజుల పాటు ఉపయోగించవచ్చు.

బఠానీ వల్ల ప్రయోజనాలు ఏంటి?

బఠానీలు ప్రోటీన్లు, విటమిన్లు C, K, B6, ఫైబర్, ఐరన్ కలిగి ఉంటాయి. కూరగాయల తయారీ, పులావ్, బిర్యానీ, సూప్‌లు, సలాడ్‌లు, స్నాక్స్‌లు, పరాటాలు, సమోసాలు వంటి వివిధ వంటకాలలో దీనిని ఉపయోగిస్తారు. ఇది కూరగాయలు ఇతర ఆహారాలకు మరింత రుచిగా ఉంటుంది. బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బఠాలనీలు తింటే మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా బఠానీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. ఈ బఠానీలలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీనితో పాటు ఇందులో ఉండే విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బఠానీ వల్ల లాభాలే లాభాలు

చలికాలంలో మీ ఆహారంలో బఠానీలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బఠానీలలో కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. బఠానీలలో లుటిన్,   జియాక్సంతిన్(Zeaxanthin) వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రత్యేకంగా శాఖాహార ఆహారాన్ని అనుసరించే వారికి బఠానీలు మంచి ప్రోటీన్  ఇస్తుంది. బఠానీలు కండరాలను బలోపేతం చేయడమే కాక రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మధుమేహంతో బాధపడేవారు నిత్యం బఠానీలు తీసుకోవాలి. బఠానీలు తక్కువ గ్లైసెమిక్‌ను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బఠానీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. రక్త లోపాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఇది చదవండి: ప్రతిదానికీ పారాసెటమాల్ వాడుతున్నారా? అయితే మీకు టికెట్ కన్ఫార్మ్ అయినట్టే.!

చలికాలంలో ఉసిరికాయ వీరికి విషంతో సమానం.. . పొరపాటున కూడా తినకండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి