
మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. ఒక రోజు తినకపోయినా పర్వాలేదు కానీ.. సరిగ్గా నిద్రలేకపోతే మాత్రం చాలా కష్టం. మనిషి మనిషిలా ఉండలేడు. తల నొప్పి, వికారం, వాంతులు, చికాకు, కోపం, ఆకలి ఇలా చాలా చిరాకుగా ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అనేక మంది నిద్ర లేమి సమస్యలతో సతమతమవుతున్నారు. సరిగ్గా నిద్ర లేకుంటే చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. బాడీ మొత్తం డీలా పడి పోతుంది. జ్ఞాపక శక్తి అనేది మందగిస్తుంది. తగినంత నిద్ర లేకపోతే అనేక వ్యాధులు వస్తాయి.
సాధారణంగా ఒక మనిషి ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. లేదంటే పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంకొంత మందికి నిద్ర సరిపోయిందనే భావనలో ఉంటారు. కానీ మీలో ఈ లక్షణాలు కనిపిస్తు ఖచ్చితంగా మీకు నిద్ర అవసరం అని గుర్తు పెట్టుకోండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
* నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఏ పని మీదా దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. మీరు త్వరగా గందర గోళానికి గురవుతారు. పనిలో గందరగోళంగా అనిపిస్తుంది.
* నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది మందగిస్తుంది. ఏ విషయాలూ త్వరగా గుర్తుకు రావు. చిన్న చిన్న విషయాలను కూడా మర్చి పోతూ ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు.
* సరిగ్గా నిద్ర లేకపోతే మనిషిలో బద్ధకం అనేది బాగా పెరుగుపోతుంది. ఏ పనీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అన్ని పనులను వాయిదా వేసేస్తారు. నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది. కోపం ఎక్కువగా వస్తుంది.
* నిద్ర సరిగ్గా లేకపోతే ఎక్కువగా రకరకాల ఆహారాలు తినాలని కోరిక పుడుతుంది. అందులోనూ జంక్ ఫుడ్ ని ఎక్కువగా తింటారు. టీలు, కాఫీలు ఎక్కువగా తాగుతారు.
* బరువు ఎక్కువగా పెరుగుతారు. ఊబకాయానికి దారి తీస్తుంది. పలు దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తాయి. బీపీ, షుగర్, గుండె పోటు, థైరాయిడ్, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
* మానసికంగా, శారీరికంగా బలహీనంగా మారతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బలహీన పడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు త్వరగా ఎటాక్ చేస్తాయి. ఆందోళన, ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.