Black Pepper: బీపీ సమస్యా..? అసలు తగ్గట్లేదా.. నల్ల మిరియాలతో ఇలా చేయండి
నల్ల మిరియాలనేవి ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండేవే. నల్ల మిరియాలు కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటుకు చాలా మంచిది. అధిక రక్తపోటు సమస్య ఉంటే రోజూ పరగడుపున వేడి నీళ్లలో ఒక నల్ల మిరియాలు కలిపి సేవిస్తే అధిక రక్తపోటు సమస్య నియంత్రణలో ఉంటుంది.
రక్త పోటు ఇటీవలి కాలంలో పెను సమస్యగా మారుతోంది. గతంలో 50, 60 ఏళ్లు పైబడిన వారే ఈ సమస్య బారిన పడేవారు. ఇప్పుడు యువత, టీనేజర్లు, చిన్న, చిన్న పిల్లలు సైతం రక్తపోటు బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలకు రక్త పోటే ప్రధాన కారణం. మీ రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే.. దాన్ని అదుపు చేసేందుకు డాక్టర్లు మీకు మందులు రాసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలతో కూడా బీపీని కొంతమేర అదుపు చేయవచ్చు. రక్తపోటులో ఆకస్మిక పెరుగుదలను నల్ల మిరియాలు సహాయంతో నియంత్రించవచ్చు. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల మిరియాలను మీరు నమలవచ్చు. ఘాటు తట్టుకోలేం అనుకుంటే.. మీ సలాడ్‌లు, సూప్‌లు, కూరల్లో వేసుకోవచ్చు. లేదా అర చెంచా నల్ల మిరియాల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల కూడా మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.
నల్ల మిరియాలు రక్తపోటును ఎలా తగ్గించడంలో సహాయపడతాయి?
నల్ల మిరియాలలో పైపెరిన్‌తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, థైమ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్ని ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే సమ్మేళనం. గుండెలో పొటాషియంను పెంచడం ద్వారా పైపెరిన్.. సోడియం ఉనికిని అదుపు చేస్తాయని అని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 46% పెద్దలకు అధిక రక్తపోటు ఉంటుంది. కానీ వారికి ఆ వ్యాధి ఉన్నట్లు తెలియదు. మీ రక్తపోటు 180/120 mmHg కంటే పెరిగినప్పుడు మీకు ఈ క్రింది లక్షణాలు ఉండొచ్చు.
– తలనొప్పి
– హృదయ స్పందన రేటులో వేగం
– ముక్కులో రక్తస్రావం
ఇలాంటి సందర్భాల్లో మీరు వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
అధిక రక్తపోటుకు కారణమేమిటి?:
అధిక ఉప్పుగల ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, సరైన నిద్ర లేకపోవడం, మూత్రపిండాల సమస్య, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు అధిక రక్తపోటుకు దారితీస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడం మేలు.