Chest Pain: వేసవికాలంలో కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల తరచుగా ఛాతీలో నొప్పి, మంటగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి ఇతర కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అయితే ప్రజలు పెయిన్ కిల్లర్స్ తీసుకొని తమకి తాము చికిత్స చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అలవాటుగా మారితే చాలా ప్రమాదం. అందుకే నిపుణులు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకూడదని చెబుతున్నారు. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. వాస్తవానికి గుండెపోటుకు ఛాతీ నొప్పి ప్రధాన లక్షణం. అయితే చాలా మంది దీనిని గ్యాస్ పెయిన్‌గా భావించి సొంతంగా మందులు వేసుకుంటారు. ఎవరైతే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పిని అనుభవిస్తారో అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడాతారో వారు వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.
బ్రిటిష్ మెడికల్ జనరల్ ప్రకారం.. పెయిన్ కిల్లర్లు కొన్నిసార్లు కిడ్నీ, కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఈ మందులు మూత్రపిండాల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ హృదయ స్పందనను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఛాతినొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. అయితే వీటిని వేసుకున్నాక కడుపు నొప్పి వస్తే ఆసుపత్రికి వెళ్లాలి. గుండె రోగులు పెయిన్ కిల్లర్స్ అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలు, చిన్న పిల్లలకు కూడా ఇవ్వకూడదు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి