Health Care Tips: ఆకలి వేయడం లేదా.. అస్సలు లైట్ గా తీసుకోవద్దు!

అప్పుడప్పుడూ ఆకలి వేయకపోవడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే కొంత మందిలో మాత్రం సడెన్ గా ఆకలి వేయడం తగ్గి పోతుంది. ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తిండి మీద అస్సలు ధ్యాస ఉండదు. రోజంతా తినకపోయినా వారికి ఆకలి అనేది వేయదు. ఆకలి వేయలేదని తేలిగ్గా చెబుతూ ఉంటారు. కానీ.. ఆకలి లేకపోవడం అనేది.. ఆందోళన చెందాల్సిన విషయమే. ఇది మీ శరీరంలో దాగి ఉన్న పలు రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా..

Health Care Tips: ఆకలి వేయడం లేదా.. అస్సలు లైట్ గా తీసుకోవద్దు!
Health Care Tips

Edited By:

Updated on: Dec 17, 2023 | 9:45 AM

అప్పుడప్పుడూ ఆకలి వేయకపోవడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే కొంత మందిలో మాత్రం సడెన్ గా ఆకలి వేయడం తగ్గి పోతుంది. ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తిండి మీద అస్సలు ధ్యాస ఉండదు. రోజంతా తినకపోయినా వారికి ఆకలి అనేది వేయదు. ఆకలి వేయలేదని తేలిగ్గా చెబుతూ ఉంటారు. కానీ.. ఆకలి లేకపోవడం అనేది.. ఆందోళన చెందాల్సిన విషయమే. ఇది మీ శరీరంలో దాగి ఉన్న పలు రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా చెప్పొచ్చు. ఒక పూట తినకపోయినా ఆకలి వేయడం లేదంటే.. ఖచ్చితంగా దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించి.. వైద్యులను సంప్రదించాలి. అసలు ఆకలి వేయకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంటు వ్యాధులు:

క్షయ వ్యాధి, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధులు ఉన్నట్లయితే ఆకలి అనేది సన్నగిల్లుతుంది. శరీరంలో ఈ ఇన్ ఫెక్షన్లు ఉంటే.. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. జీర్ణ వ్యస్థ పని తీరుకు అంతరాయం కలిగి.. లోలోపల వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది.

మానసిక ఆరోగ్యం:

మానసిక ఆరోగ్యం బాగోలేక పోయినా ఆకలి వేయదు. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలతో బాధ పడే వారిలో కూడా ఆకలి వేయదు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి

థైరాయిడ్ పని చేయకపోవడం:

జీవ క్రియను నియంత్రించేది థైరాయిడ్. అలాంటి థైరాయిడ్ గ్రంథి పని చేయక పోయినా.. హైపో థైరాయిడిజం బారిన పడినా కూడా ఆకలిపై ధ్యాస ఉండదు. ఈ గ్రంథి ఎప్పుడు సరిగ్గా పని చేయదో అప్పుడు ఆకలిలో ఇన్ బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి ఆకలి తగ్గి పోవడానికి కూడా థైరాయిడ్ గ్రంథి ఒక కారణం అవుతుంది.

క్యాన్సర్ కూడా కారణం అవ్వొచ్చు:

హఠాత్తుగా ఆకలి తగ్గడం లేదా క్రమంగా ఆకలి తగ్గుతూ వేయకపోవడానికి క్యాన్సర్ కూడా ఒక కారణం కావొచ్చు. పొట్ట క్యాన్సర్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల ఆహారంపై ధ్యాస ఉండదు. ఏమీ తినాలని కానీ తాగాలని కానీ అనిపించదు. క్యాన్సర్ ఎటాక్ చేసే ముందు కనిపించే లక్షణాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.