Papaya: బొప్పాయిని ఈ పండ్లు, పదార్థాలతో కలిపి అసలు తీసుకోకూడదు.. ఎందుకంటే?

|

Sep 27, 2022 | 9:50 PM

Papaya Side Effects: బొప్పాయి పండును సాధారణంగా అందరూ ఇష్టపడతారు. పైగా ఇది ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండు. ఇందులో ఆరోగ్యానికి లాభం చేకూర్చే పలు పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ  సమృద్ధిగా ఉంటాయి.

Papaya: బొప్పాయిని ఈ పండ్లు, పదార్థాలతో కలిపి అసలు తీసుకోకూడదు.. ఎందుకంటే?
Papaya Fruit
Follow us on

Papaya Side Effects: బొప్పాయి పండును సాధారణంగా అందరూ ఇష్టపడతారు. పైగా ఇది ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండు. ఇందులో ఆరోగ్యానికి లాభం చేకూర్చే పలు పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ  సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్నా బొప్పాయిని కొందరు తినకూడదని నిపుణులు చెబుతారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ పండును తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే కొన్ని పదార్థాలతో బొప్పాయి పండును అసలు తీసుకోకూడదట. అవేంటో చూద్దాం రండి.బొప్పాయి, నారింజ పండ్లు.. రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని కలిపి తినకూడదు. ఎందుకంటే నారింజ పుల్లగా ఉంటుంది. అలాగే బొప్పాయి తీపి పండు. రెండూ ఒకదానికొకటి వ్యతిరేకం. వీటిని కలిపి తీసుకుంటే విరేచనాలు, అజీర్ణం సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వాటిని కలిపి తీసుకోవడం మానుకోండి.

ఇక మనలో చాలామందికి బొప్పాయి చాట్ తినడం అలవాటు. ఇందులో నిమ్మకాయ వాడతారు కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. బొప్పాయితో నిమ్మకాయను కలిపి తీసుకుంటే రక్త సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీటిని వేర్వేరుగా మాత్రమే తీసుకుంటే మంచిది. అలాగే బొప్పాయితో పెరుగు కలిపి తినవద్దు. ఎందుకంటే బొప్పాయి వేడిగానూ, పెరుగు చల్లగానూ ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..