health news: ఈ పండ్లను రాత్రిపూట తింటున్నారా.. అయితే మీరు సమస్యలు ఎదుర్కొవాల్సిందే..

|

May 21, 2022 | 6:00 AM

పండ్లు(fruits) ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అందుకే వైద్యులు(Doctors) ఎక్కువగా పండ్లు తీసుకోమ్మని చెబుతారు...

health news: ఈ పండ్లను రాత్రిపూట తింటున్నారా.. అయితే మీరు సమస్యలు ఎదుర్కొవాల్సిందే..
Fruits
Follow us on

పండ్లు(fruits) ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అందుకే వైద్యులు(Doctors) ఎక్కువగా పండ్లు తీసుకోమ్మని చెబుతారు. పిల్లలకైనా, పెద్దవారైనా పండ్లు తినడం చాలా అవసరం. అయితే ఈ పండ్లను సమయం సందర్భాన్ని బట్టి తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లను రాత్రి పడుకునే ముందు అస్సలు తినద్దొట.. అందులో అరటి పండు(banana) ఒక్కటి. అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పండును రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది వ్యాయామం తర్వాత లేదా సాయంత్రం పూట అరటి పండ్లను తింటుంటారు. కానీ ఈ పండును జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ సలాడ్‌గా రాత్రిపూట తీసుకోకూడదట. రాత్రిపూట అరటి పండ్లను తింటే మీ శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రపోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందట.

రోజూ ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆపిల్ పండు ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ వీటిని రాత్రిపూట మాత్రం తినకూడదట. రాత్రి సమయంలో యాపిల్ పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. రాత్రి సమయంలో ఆపిల్ పండ్లను తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. రాత్రిపూట సపోటాలను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని రాత్రిపూట తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందట. అందుకే పడుకునే ముంది అరటి, అపిల్‌, సపోట పండ్లు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..