Health Tips: వేడి నీళ్లు తాగడం వల్ల లాభాలు తెలుసా.. మరి నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

నీళ్లను కాచి చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. ఇళ్లల్లో చాలా మంది ఈవిధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే ఈమధ్య కరోనా ప్రభావంతో ఎక్కువ మంది వేడి నీళ్లను తాగడం అలవాటు చేసుకున్నారు. వైరస్ వేడిని తట్టుకోలేదు..

Health Tips: వేడి నీళ్లు తాగడం వల్ల లాభాలు తెలుసా.. మరి నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

Updated on: Sep 19, 2022 | 10:47 AM

Health Tips: నీళ్లను కాచి చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. ఇళ్లల్లో చాలా మంది ఈవిధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే ఈమధ్య కరోనా ప్రభావంతో ఎక్కువ మంది వేడి నీళ్లను తాగడం అలవాటు చేసుకున్నారు. వైరస్ వేడిని తట్టుకోలేదు కాబట్టి.. వేడి నీళ్లు తాగడం వల్ల కరోనా వైరస్ ప్రభావం నుంచి దూరంగా ఉండొచ్చనే ఉద్దేశంతో వేడి నీటిని తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే వేడినీళ్లు తాగడం వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగుతుంటారు. తద్వారా ఉదరంలో మలినాలను తొలుగుతాయని భావిస్తారు. వేడి నీరు తీసుకునే సమయంలో కొన్ని నియామాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కొన్ని సమస్యల తప్పవని అంటున్నారు. వేడి నీటిని సరయైన పద్దతిలో తాగకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే, అది వ్యక్తి నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా ఏర్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీటి వినియోగం వల్ల ప్రేగులు మొదలైన అంతర్గత అవయవాలపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంది.

శరీరంలోని అంతర్గత అవయవాల కణజాలాలు చాలా సున్నితంగా ఉంటాయి.అటువంటి పరిస్థితిలో తరచుగా వేడి నీటిని తాగితే మీ అంతర్గత అవయవాలలో బొబ్బలు ఏర్పడవచ్చు. పేగు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, వేడి నీటిని తీసుకునే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి నీటిని తీసుకుంటే, అది వ్యక్తికి హీట్‌స్ట్రోక్ సమస్యను కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు, సాధారణ నీటిని మాత్రమే తాగాలి. వేడిగా ఉండే నీటిని ఎక్కువగా తాగడం వల్ల రక్త పరిమాణంలో తేడాలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. వేడి నీటిని తీసుకోవడం వల్ల కూడా నాలుక దెబ్బతింటుంది. ఇది కాకుండా, వేడి నీరు గొంతు నొప్పి, పెదవులు మొదలైనవాటిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా నీరు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయంటున్నారు. మూత్రపిండాలు ప్రత్యేకమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి, ఇది శరీరం నుండి అదనపు నీటిని, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. వేడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నారు. దీని కారణంగా సాధారణ మూత్రపిండాల పనితీరులో సమస్య ఏర్పడుతుంది. దీనితో పాటు, వ్యక్తి యొక్క సిరల్లో వాపు సమస్య కూడా ఉండవచ్చు. అందుకే నీరు ఎక్కువ వేడిగా ఉనప్పుడు కాకుండా.. చల్లార్చి తాగాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..