
మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల దగ్గర నుంచి యువత వరకూ అందరూ దీని బారిన పడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. డయాబెటిస్ అనేది యువతలో ఇబ్బందికరమైన ధోరణిగా ఉంటుంది. వారి ఆరోగ్య సంరక్షణ అవసరాలు వారి తోటివారి కంటే ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబతున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం రేటుతో సంబంధం ఉన్న అనేక అంశాలు ఉన్నాయని వైద్య నిపుణుల భావన. భారతదేశంలో మధుమేహం వ్యాప్తి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా ఎక్కువని చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పిల్లలలో మధుమేహం ఎనిమిది శాతం కంటే ఎక్కువగా పెరుగుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం భారత్ డయాబెటిక్ హబ్‌గా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నాయి.
పిల్లలు, యువకులలో కేసులు పెరగడానికి ప్రధాన కారణాన్ని వైద్యులు తెలుసుకునే పనిలో పడ్డారు. టైప్ 1 మధుమేహం సాధారణంగా శీతాకాలంలో జనవరిలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధ్యయనాల్లో తేలింది. విటమిన్ డీ లోపంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ మధుమేహానికి కారణం కావచ్చని కొంతమంది వైద్యుల భావన చికెన్ పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్యాంక్రియాస్‌ను ప్రభావితం చేసి, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని భంగపరుస్తాయి. క్రమేపి అది డయాబెటిస్‌కు కారణం అవుతుంది. .తక్కువ స్థాయి విటమిన్ డి టైప్ 2 మధుమేహాన్ని పెంచే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్ డి లోపం ఇన్సులిన్ కార్యకలాపాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయానాలు చేయాల్సి ఉంది.
రోగ నిర్ధారణలో గరిష్ట వయస్సు టైప్ 1 డయాబెటిస్‌కు 10 సంవత్సరాలుగా ఉంటే టైప్ 2 డయాబెటిస్‌కు 16 సంవత్సరాలని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన ఇబ్బందుల కారణంగా భారతీయులలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు ప్రభావితం అవుతాయని నిపుణుల వాదన. డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి మిల్లెట్‌లను ప్రోత్సహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. టైప్ 1 మధుమేహం ఎక్కువగా జన్యు వైవిధ్యం వల్ల వస్తుందని, అయితే టైప్ 2 మధుమేహం జీవనశైలితో జన్యు సంబంధిత సమస్యల వల్ల వస్తుందని తెలిపారు. యూఎస్‌లో చేసిన ఈ పరిశోధనలో 18,000 మందికి పైగా పిల్లలు, యువకులు టైప్ 1 డయాబెటిస్‌తో, 5,200 కంటే ఎక్కువ మంది యువకులు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాదాపు 17 సంవత్సరాల విశ్లేషణలో, టైప్ 1 డయాబెటిస్ సంభవం సంవత్సరానికి 2 శాతం పెరిగితే, టైప్ 2 డయాబెటిస్ సంభవం సంవత్సరానికి 5.3 శాతం పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి