Diabetes: ప్రస్తుతం వివిధ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. మధుమేహం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే అధిక ఒత్తిడి, తినే ఆహారం, మానిసక ఆందోళన తదితర కారణాల వల్ల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ రోజుల్లో టీనేజర్స్ కూడా మధుమేహం బారిన పడుతున్నారు. అయితే షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలంటే మన వంటింటి చిట్కాలను పాటిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వివిధ అధ్యయనాల ప్రకారం.. సాధారణ వంటల్లో వాడే జీలకర్ర మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్సూలిన్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. జీలకర్ర విత్తనాల రూపంలోగానీ, పొడి రూపంలోగానీ తీసుకుంటే ఎంతో మేలంటున్నారు. జీలకర్రలో ఉండే ఉపయోగాలపై నిపుణులు అధ్యయనం చేశారు. ఇందులో మధుమేహం అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తించారు. ఇదే కాకుండా ఆస్తమాతో బాధపడేవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. జీలకర్రలో ఐరస్ పుష్కలంగా ఉంటుంది.
మన శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. రోజువారిగా తినే ఆహారంలో జీలకర్రను చేర్చుకుంటే ఎంతో మంచిదంటున్నారు. అలాగే వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా నివారిస్తుంది. ముఖంలో ముడతలు ఏర్పడకుండా ఎంతగానో సహాయపడుతుంది. వేయించిన జీలకర్రను పొడి చేసుకుని ఓ సీసాలో నిల్వ ఉంచుకుని రోజుకు కొంచముగా తీసుకుంటే వికారం, వాంతులు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది ఎసిడిటిత బాధపడుతుంటారు. అలాంటి వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జీలకర్ర తినడం వల్ల పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా వంటివి రాకుండా కాపాడుతుంది.
రాత్రి పూట కొన్ని నీళ్లల్లో జీలకర్ర నానపెట్టి వాటితో పొద్దున్నే ముఖం కడుక్కుంటే ముఖం మెరుస్తుంది. నీటిలో జీలకర్ర వేసి ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న నల్లమచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మంలో రక్తప్రసరణను పెంచుతుంది.