Health Tips: మీ మెడపై నల్లటి వలయాలు అనారోగ్యానికి సంకేతం.. తస్మాత్ జాగ్రత్త..!

|

Sep 21, 2022 | 7:56 PM

నడుము లేదా భుజాలపై వెల్వెట్ చర్మం కనిపించడం ప్రారంభించినట్లయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే..

Health Tips: మీ మెడపై నల్లటి వలయాలు అనారోగ్యానికి సంకేతం.. తస్మాత్ జాగ్రత్త..!
Dark Circles On Neck
Follow us on

Health Tips: కళ్ల కింద కనిపించే నల్లటి వలయాల గురించి మనం తరచుగా చర్చిస్తాం, అవి నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఏర్పడతాయి. కానీ మెడపై కనిపించే నల్లటి వలయాల ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ సర్కిల్‌లు మురికి పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయని అనుకుంటాం..కానీ, దీనికి అంతర్గత సమస్యల వల్ల ఇలా జరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం ప్రారంభిస్తే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం అని తెలుసుకోవటం మంచిది. కాబట్టి, సమయానికి అప్రమత్తంగా ఉండటం అవసరం.

మెడపై కనిపించే నల్లని గీతల విషయంలో సీరియస్‌గా ఉండటం ముఖ్యం. అవి మీకు సమస్యగా మారవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,.. ఇవి ప్రీడయాబెటిస్ లక్షణాలు, అంటే మీ శరీరం ఇప్పుడు డయాబెటిస్ సంకేతాలను చూపుతోంది. దీన్ని ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అలాగే రోజువారీ ఆహారంలో మార్పులు చేయాలి. ఒత్తిడి తగ్గింపు, 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. సిగరెట్లు, బీడీలు, హుక్కాలు మన ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. వీటివల్ల మెడపై నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి చెడు అలవాట్లు గనుక వదిలేయటం మంచిది.

ఇవి కూడా చదవండి

మీరు జీవనశైలిలో మార్పుల ద్వారా ప్రీడయాబెటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. చర్మంపై ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే దీని కోసం వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఆపై పరీక్ష చేయడం అస్సలు మర్చిపోవద్దు. నడుము లేదా భుజాలపై వెల్వెట్ చర్మం కనిపించడం ప్రారంభించినట్లయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రీడయాబెటిస్ లక్షణాలలో చేర్చబడిన ఇన్సులిన్ పెరిగిన సంకేతమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి