మన ఆరోగ్యం పూర్తిగా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జంక్‌ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మనం తినే ఆహారం జుట్టు మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. చెడు ఆహారం అలవాట్ల వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం మార్కెట్‌లో లభించే షాంపూలు, కండిషనర్లు, నూనెలు, రంగులు మొదలైన వాటిని ఉపయోగిస్తాము. కానీ, వీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించడానికి బదులుగా, మరొక సమస్యకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ హోం రెమెడీని ఉపయోగిస్తే సమస్యకు సహజమైన పరిష్కారాన్ని పొందవచ్చు.
జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు వేప :
కరివేపాకు, వేప ఆకులు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. మెలనిన్ లేకపోవడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కరివేపాకు జుట్టులో మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.
కరివేపాకుతో హెయిర్ మాస్క్:
మాస్క్ చేయడానికి మీకు కరివేపాకు, కొబ్బరి నూనె , వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్, పెరుగు అవసరం. మాస్క్ చేయడానికి కరివేపాకు, వేప ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాత్రలో కొబ్బరినూనె, విటమిన్ ఇ క్యాప్సూల్, పెరుగు వేసి సరిగ్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత అందులో కరివేపాకు, వేప ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మీ హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది.
జుట్టు మీద ఎలా అప్లై చేయాలి: జుట్టు
మీద హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, జుట్టును బాగా కడిగి ఆరబెట్టండి. తర్వాత హెయిర్ మాస్క్‌ని జుట్టు, తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును మళ్లీ కడగాలి. వారానికి రెండు సార్లు ఈ హోం రెమెడీని పాటించినట్టయితే, మీరు త్వరలోనే ఫలితాలను చూస్తారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి