లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా క్రికెట్ బాల్ సైజ్‌‌‌‌‌‌‌లోని కణితను తొలగించిన వైద్యులు. ఎక్కడంటే..

|

Feb 27, 2021 | 9:40 AM

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్యరంగంలోను అనేక మార్పులు జరుగుతున్నాయి. అరుదైన వ్యాధులకు కూడా అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారు.

లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా క్రికెట్ బాల్ సైజ్‌‌‌‌‌‌‌లోని కణితను తొలగించిన వైద్యులు. ఎక్కడంటే..
Follow us on

laparoscopic surgery : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్యరంగంలోను అనేక మార్పులు జరుగుతున్నాయి. అరుదైన వ్యాధులకు కూడా అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారు. తాజాగా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగించి 55 ఏళ్ల వ్యక్తి యొక్క కుడి వైపు మూత్రపిండాల నుండి భారీ పరిమాణంలోని కణితిని వైద్యులు తొలగించారు.

హైదరాబద్ లోని ఎల్బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్లో ఈ సర్జరీ జరిగింది. లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి మూత్రపిండాలనుంచి  క్రికెట్ బాల్ సైజ్ లో ఉన్న కణితను తొలగించారు వైద్యులు. ఈ సర్జరీ ద్వారా పేషంట్ త్వరగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. అలాగే  మూత్రపిండాల నుండి పెద్ద కణితిని తొలగించడానికి అతి తక్కువ నొప్పిని కలిగించే కీహోల్ శస్త్రచికిత్సను చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మూత్రపిండ కణితులు మరియు క్యాన్సర్‌ కు సంబంధిచిన కణితిని తొలగించడానికి పలు రకాలుగా చికిత్స చేయవచ్చు,  రెగ్యులర్ ట్రీట్మెంట్ లా ఆపరేషన్ చేసి కోసి కణితను తొలగించవచ్చు అధునాతన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సా విధానం ద్వారా  చికిత్సను అందించవచ్చు.

రోగి అనుమతి తోనే ఆసుపత్రి సర్జన్లు కీహోల్ సర్జరీని చేయాలని నిర్ణయిస్తారు. సీనియర్ యూరాలజిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్, డాక్టర్ అమన్ చంద్రతో పాటు గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్లోని సిఒఓ క్లస్టర్, డాక్టర్ మెర్విన్ లియో ఆధ్వర్యంలో ఈ చికిత్సా విధానాన్ని నిర్వహించామని వైద్యులు తెలిపారు .“కణితిని తొలగించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ, సాధ్యమైనంత ఉత్తమమైన విధానంతో కణితిని కొద్దిపాటి నొప్పితో కణితను తొలగించాలని లాపరోస్కోపిక్ ఎంచుకున్నామని తెలిపారు. కీహోల్ విధానం ద్వారా రోగి మూడు రోజుల్లోనే కోలుకుంటారు, అదే రెగ్యులర్ గా చేసే ఆపరేషన్ ద్వారా అయితే పేషంట్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని  డాక్టర్ చంద్ర చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vitamin D Food: విటమిన్‌-డి లోపంతో బాధపడతున్నారా.? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.? అయితే ఇలా చేయండి..

Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..