Corona in Children: పిల్లల్లో లక్షణాలు కనిపించకుండా కరోనా..ఇప్పటివరకూ అదుపులోనే..కానీ.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jun 01, 2021 | 9:44 PM

Corona in Children: పిల్లలలో కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మూడవ వేవ్ పిల్లలపైనే విరుచుకుపడే అవకాశాలున్నాయని ఊహాగానాలు చాలా వస్తునాయి. ఈ నేపధ్యంలో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు కొన్ని సూచనలు చేసింది.

Corona in Children: పిల్లల్లో లక్షణాలు కనిపించకుండా కరోనా..ఇప్పటివరకూ అదుపులోనే..కానీ.. నిపుణులు ఏమంటున్నారంటే..
Corona In Children
Follow us on

Corona in Children: పిల్లలలో కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మూడవ వేవ్ పిల్లలపైనే విరుచుకుపడే అవకాశాలున్నాయని ఊహాగానాలు చాలా వస్తునాయి. ఈ నేపధ్యంలో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు కొన్ని సూచనలు చేసింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ వికె పాల్ ఈ రోజు మాట్లాడుతూ.. ఈ వ్యాధి బారిన పడిన చాలా మంది పిల్లలు లక్షణరహితంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వైరస్ వారిని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. మొదట, చిన్నారులలో న్యుమోనియా లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రెండవది, ఇటీవల కోవిడ్ 19 నుండి కోలుకున్న పిల్లలలో మల్టీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.” అని ఆయన చెప్పారు.

రెండవ పరిస్థితిని వివరిస్తూ, చాలా అరుదైన సందర్భాల్లో, కోవిడ్ నుండి కోలుకున్న ఆరు వారాల తరువాత, కొంతమంది పిల్లలకు మళ్లీ జ్వరం వస్తుంది, దద్దుర్లు అలాగే, తులు కూడా వస్తాయని ఆయన అన్నారు. “మేము ఈ విషయాలను పరిశీలిస్తున్నాము. ఇటువంటి కోవిడ్ అనంతర లక్షణాలను నిర్వహించడానికి మా వైద్యులు, శిశువైద్యులు బాగా శిక్షణ పొందారు” అని ఆయన వివరించారు.

పిల్లలు, సాధారణంగా కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు కనిపించవు. “వారు తరచూ ఇన్ఫెక్షన్లను పొందుతారు, కానీ వారి లక్షణాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా పిల్లలలో కరోనా వ్యాప్తి వలన తీవ్రంగా ప్రభావమైన కేసులు ఇప్పటివరకూ లేవు.” అని ఆయన చెప్పాడు.

కోవిడ్ పిల్లలను ప్రభావితం చేసే అవకాశాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. కాని రెండవ తరంగాన్ని దృష్టిలో ఉంచుకుని వైరస్ తన ప్రవర్తనను మార్చే అవకాశాన్ని డాక్టర్ పాల్ అంగీకరించారు. మొట్టమొదటి కోవిడ్ వేవ్ ప్రధానంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, రెండవ వేవ్ యువ జనాభాను దెబ్బతీసింది. “కోవిడ్-19 ప్రభావం పిల్లలలో పెరుగుతుంది. తక్కువ సంఖ్యలో పిల్లలను ఆసుపత్రులలో చేర్చుతున్నట్లు డేటా చూపించింది. మేము ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాము. పిల్లలకు అవసరమైన చికిత్స అందించడానికి మా బృందాలు సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాము అని ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతున్నారు.

ఢిల్లీకి చెందిన ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ మరియు సెంటర్స్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, కోవిడ్ మొదటి, రెండవ వేవ్ ల నుండి వచ్చిన డేటా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి నుండి రక్షణ పొందారని సూచిస్తుంది. మూడవ వేవ్ లో పిల్లలకు సోకినట్లు చెబుతున్న వారు మొదటి రెండు వేవ్ లలో వ్యాధి బారిన పడలేదు. అందువల్ల వారు తరువాతి వేవ్ లో పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారని చెప్పారు. కానీ ఇప్పటివరకు, దీనికి ఆధారాలు లేవు భవిష్యత్తులో ఇటువంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సంభవించే అవకాశాలూ కొట్టిపారేయలేం. అంటూ డాక్టర్ గులేరియా చెప్పారు.
ఏది ఏమైనా ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం పిల్లల్లో కోవిడ్ సోకినా లక్షణాలు మాత్రం కనిపించడంలేదు. ఇతర రకాలైన లక్షనాల్లా కనిపించి తరువాత అది కోవిడ్ గా బయటపడుతోంది. అందువల్ల అందరో జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలలో కనిపించే ఏ చిన్న లక్షణాన్నీ కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Also Read: Private Hospitals License : రూల్స్ బ్రేక్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. మరో 6 ఆసుపత్రుల లైసెన్సు రద్దు..!

Hemant Soren: అంత ఖర్చు మా వల్ల కాదు.. అందరికీ ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి.. ప్రధానికి సోరెన్ లేఖ