Coriander Water Health Benefits: ధనియాలు.. అందరి వంటింట్లో ఉండే ఔషధం.. కొత్తిమీరను సాధారణంగా ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు. ధనియాలు.. ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది డైటీషియన్లు ధనియాల నీటిని (Coriander Water) తాగమని సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే.. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధాలు, పోషకాలు ఉన్నాయి. ఈ నీటిని తయారు చేయడానికి 1 టీస్పూన్ ధనియాల గింజలను తీసుకోని 1 కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ధనియాల నీటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ధనియాల నీరు ఉదయాన్నే తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెంటో ( Health Benefits) ఇప్పుడు తెలుసుకుందా..
ధనియాల నీరు.. ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి..
ధనియాల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
జుట్టు సమస్యలు..
ధనియాలలో విటమిన్ కె, సి, ఎ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జుట్టు బలంగా, వేగంగా పెరగడానికి ఇవి చాలా అవసరం. ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల మీ జుట్టు రాలడం, చిట్లడం లాంటి సమస్య తగ్గుతుంది. మీరు ధనియాల నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేయవచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది.
బరువు
ధనియాలలో జీర్ణ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ రెండు లక్షణాలు మీ బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడతాయి.
నల్లమచ్చలు-మొటిమలు నివారణకు..
ధనియాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఉదయాన్నే ఈ నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. నల్లమచ్చలు, మొటిమల సమస్య దూరమవుతుంది.
కొలెస్ట్రాల్
ధనియాలలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే కొన్ని పోషకాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే.. రోజూ ధనియాల నీరు తాగితే తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహాన్ని నియంత్రించడానికి
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధనియాల నీటిని కూడా తాగవచ్చు. ఈ నీరు తాగడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ పరిమాణం అదుపులో ఉంటుంది.
Also Read: