AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Care: ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లని కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Side effects of drinking soft drinks: వేసవి కాలం మొదలైంది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేక చాలామంది చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంటారు.

Summer Health Care: ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లని కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Cool Drink
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2022 | 1:20 PM

Share

Side effects of drinking soft drinks: వేసవి కాలం మొదలైంది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేక చాలామంది చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో శీతల పానీయాల (Cool Drinks) ను ఎక్కువగా తాగుతారు. కూల్ డ్రింక్స్ చల్లగా ఉండటమే కాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది. దీంతో కొంతమంది శీతల పానీయాలు తాగుతూ సేదతిరుతుంటారు. వేసవి (Summer) లో ఇంటికి అతిథులు వచ్చినా.. ఎక్కడికైనా వెళ్లినా శీతల పానీయాలు మాత్రమే తాగేందుకు ఇష్టపడుతుంటారు. ఈ కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. శీతల పానీయాల వినియోగం మీ ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తోందో ఇప్పుడు తెలుసుకోండి..

  • బరువు పెరుగుట: మీరు ఎక్కువ శీతల పానీయాలు తీసుకుంటే మీ బరువు వేగంగా పెరుగుతుంది. శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కెర వినియోగం బరువుతోపాటు అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఒక గ్లాసు శీతల పానీయంలో ఎనిమిది నుంచి 10 టీస్పూన్ల చక్కెర ఉంటుంది. అదేవిధంగా శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక గ్లాసు కూల్ డ్రింక్‌లో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. ప్రతిరోజూ చాలా కేలరీలు తీసుకోవడం వల్ల మీ బరువు పెరుగుతుంది.. దీంతోపాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.
  • ఫ్యాటీ లివర్ సమస్య: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శీతల పానీయాలలో రెండు రకాల చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్- ఫ్రక్టోజ్.. గ్లూకోజ్ శరీరంలో త్వరగా గ్రహించబడుతుంది.. జీవక్రియకు సాధ్యమవుతుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో మాత్రమే నిల్వ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ శీతల పానీయాలు తాగితే ఫ్రక్టోజ్ మీ కాలేయంలో అధికంగా పేరుకుపోతుంది. దీంతో కాలేయంపై ప్రభావం చూపి.. లివర్ సమస్యలను కలిగిస్తుంది.
  • మధుమేహం సమస్యలు: శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కూడా మధుమేహం సమస్య వస్తుంది. శీతల పానీయాలు శరీరంలోని చక్కెరను వెంటనే పెంచుతాయి. దీని కారణంగా ఇన్సులిన్ వేగంగా విడుదలవుతుంది. అయితే మీరు ఇన్సులిన్ హార్మోన్‌ దెబ్బతినడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుతాయి.
  • దంతాల మీద ఎఫెక్ట్: ఇలా చెబితే కొంచెం ఆశ్చర్యపోతారు.. కానీ మనం ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటే దంతాల మీద కూడా ప్రభావం చూపుతుందనేది ముమ్మాటికి నిజం. శీతల పానీయాలలో ఫాస్ఫారిక్ యాసిడ్.. ఇతర రకాల యాసిడ్లు మన దంతాలను దెబ్బతీస్తాయి.

Also Read:

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్‌పై కీలక అప్‌డేట్‌.. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలిపిన ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి

Health Tips: మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా..? ప్రమాదంలో పడినట్లే.. తక్కువగా తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటి?