Weight Loss: ఉదయం లేవగానే ఓ వెల్లుల్లి తినండి.. బరువు వేగంగా తగ్గొచ్చు.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..

వెల్లుల్లిని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరగడంతోపాటు బరువు కూడా తగ్గవచ్చు. ఎలాగంటే..

Weight Loss: ఉదయం లేవగానే ఓ వెల్లుల్లి తినండి.. బరువు వేగంగా తగ్గొచ్చు.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..
Garlic With Weight Loss
Follow us

|

Updated on: Oct 13, 2022 | 1:53 PM

బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడే వ్యక్తులు వర్కవుట్‌లు చేస్తారు. వారి ఆహారాన్ని నియంత్రించుకుంటారు.. ఆ తర్వాత కూడా వారు కోరుకున్నప్పటికీ వారు అనుకున్నట్లుగా శరీరాన్ని పొందలేరు. చాలా మంది ప్రజలు బరువును నియంత్రించడానికి ఇంటి నివారణలను నమ్ముతారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి తరచుగా వెల్లుల్లిని తినమని సూచిస్తుంటారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం అనేది బరువు తగ్గడానికి పురాతన చిట్కాలలో ఒకటి. అయితే.. ఇది చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు. వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పచ్చి వెల్లుల్లి ఒక గొప్ప రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

జీవనశైలిలో మార్పులు చేసుకుంటే, ఆహారం నియంత్రించబడి. అదే సమయంలో వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే.. బరువు వేగంగా తగ్గవచ్చు. వెల్లుల్లి బరువును తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. జీవక్రియను పెంచి బరువును నియంత్రించే పోషకాలు ఇందులో ఉంటాయి. బరువు తగ్గించడంలో వెల్లుల్లి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది?

తెల్లవారుజామున ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది కాబట్టి బరువు తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అలా అని మీరు అతిగా తినకూడదు.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇది డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా తినాలి?

బరువు తగ్గడానికి.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తినండి. మీకు మలబద్ధకం సమస్య ఉంటే వెల్లుల్లిని తినకండి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, తక్కువ రక్తపోటు(లో బీపీ), రక్తస్రావం రుగ్మతలు, మధుమేహం ఉన్న రోగులు ఈ ఇంటి నివారణను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

  • వెల్లుల్లి ఎక్కువగా తినడం కూడా సరికాదు. ఎందుకంటే ఇది కడుపుని చికాకుపెడుతుంది.
  • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు వెల్లుల్లిని తినకూడదు.
  • వెల్లుల్లిలో ఉండే కొన్ని రసాయనాలు ఛాతీ, కడుపులో మంటను కలిగిస్తాయి. కాబట్టి దానిని అతిగా తినకండి.
  • వెల్లుల్లి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. దాని లక్షణాలు దద్దుర్లు, పెదవులు లేదా నాలుకలో జలదరింపులకు కారణమవుతాయి. దీని వల్ల ముక్కులో దురద వస్తుంది. తుమ్ము, కళ్ళు దురద వచ్చే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..