Cold Water Side Effects: చలికాలంలో చల్లటి నీళ్లు తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? గుండెపై కూడా ఎఫెక్ట్‌

చలికాలంలో చల్లటి నీటిని తాగితే, మరుసటి రోజు ముక్కు మూసుకుపోతుంది. అంతే కాకుండా జలుబు సమస్య వల్ల ఛాతీలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

Cold Water Side Effects: చలికాలంలో చల్లటి నీళ్లు తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? గుండెపై కూడా ఎఫెక్ట్‌
Cold Water

Updated on: Dec 06, 2022 | 8:01 AM

వేడినీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లు నిత్యం వేడినీళ్లు తాగుతుంటారు. అలాగే చల్లటి నీరు తాగే అలవాటు ఉన్నవారు ఎప్పుడూ చల్లటి నీటిని తాగడానికి ఇష్టపడతారు. కానీ చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చల్లటి నీటిని తాగితే, మరుసటి రోజు ముక్కు మూసుకుపోతుంది. అంతే కాకుండా జలుబు సమస్య వల్ల ఛాతీలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. చల్లటి నీరు గొంతును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గొంతు నొప్పి, వాయిస్ కోల్పోవడం వంటి సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇక చలికాలంలో చల్లటి నీరు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. చల్లటి నీరు జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.అందుకే చలికాలంలో చల్లటి నీరు బదులు గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. చల్లని నీరు దంతాలలోని నరాలను బలహీనపరుస్తుంది. అదనంగా, చల్లని నీరు మీ కడుపుకు హాని కలిగిస్తుంది. జీర్ణక్రియలో సమస్యలను కూడా కలిగిస్తుంది. దీనితో పాటు, వికారం, కడుపు నొప్పి కూడా రావచ్చు. అందుకే చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి. ఎందుకంటే కేవలం రుచి కోసమో, అలవాటు కోసమో చల్లటి నీరు తాగకండి. చల్లటి నీరు శరీరానికి చాలా రకాలుగా హానికరం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..