
బరువు తగ్గడానికి, జిమ్ చేసేటప్పుడో చాలామంది ప్రోటీన్ పౌడర్లు కొని తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే, కొబ్బరిలో బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి, బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. మన చిన్నప్పుడు తల్లిదండ్రులు బెల్లం కొబ్బరి కలిపి కొబ్బరి ఉండలుగా చేసి పెట్టేవారు. నేటి తరానికి కొబ్బరి ఉండ రుచి, వాటిని చేసే విధానం, వాటివల్ల కలిగే ప్రయోజనాలు సరిగా తెలియడం లేదు. కొబ్బరి ఉండల సంగతి చాలా మంది మర్చిపోయినట్టే ఉన్నారు.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదు. బెల్లం కొబ్బరిని కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యలు వాస్తవానికి దూరమవుతాయి. గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకొని తాగినా లేదా టీలో చక్కెరకి బదులుగా బెల్లాన్ని వాడినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి బెల్లాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి బెల్లం మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, శరీరంలో అనవసరమైన నీరు నిలవలేకుండా చేస్తుంది.
కొబ్బరి బెల్లంలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఈ రెండిటినీ కలిపి తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు కొబ్బరి బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. అందుకే గర్భిణులు ఏడో నెల నుంచి కొబ్బరి బెల్లాన్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లు తగ్గుతాయి. మైగ్రేన్ ఉన్నవారు కొబ్బరి బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి బెల్లంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అలసటగా ఉన్నప్పుడు కొబ్బరి బెల్లాన్ని తింటే తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి, మన సాంప్రదాయ ఆహార పదార్థాలను ఎప్పుడూ వదులుకోవద్దు. కొబ్బరి బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో దారుణ వ్యాధులు రాకుండా ఈ కాంబినేషన్ పనిచేస్తుంది.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.