Health Benefits of Cloves: మన వంటింట్లోనే పలు జబ్బులను నయం చేసే ఔషధాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఔషధాల్లో మసాలా దినుసు లవంగం కూడా ఒకటి. ఘాటు ఉండే ఈ దినుసును దేవకుసుమ అని కూడా అంటారు. ఇది ఒక సుగంధ ద్రవ్యం. ప్రతిఇంట్లో మసాలా దినుసుల్లో ఇది కూడా ఒకటి. ఈ సుగంధ ద్రవ్యాన్ని రుచికోసం కూరల్లో వాడుతారు. ఇవి మంచి వాసనేకాదు.. మనకు కావాల్సిన పోషకాలను అనేకం అందించి ఆరోగ్యవంతంగా ఉండటంలో సాయపడతాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ,సీ అలాగే.. అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వంటల్లోనే కాదు కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా టూత్‌పేస్ట్ తయారీలో కూడా లవంగాలను ఉపయోగిస్తారు. అయితే.. ఎన్నో ఔషధ గుణాలున్న లవంగాలను ప్రతిరోజూ రెండు తింటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగాలు.. ఆరోగ్య ప్రయోజనాలు..
• కడుపు ఉబ్బరంగా ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వికారం లాంటివి కూడా దూరమవుతాయి.
• జలుబు, దగ్గుకు లవంగం మంచి ఔషదంలా పనిచేస్తుంది. నోట్లో ఓ లవంగం వేసుకుని చప్పరిస్తుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది.
• లవంగాలను రోజూ తింటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోతాయి.
• తలనొప్పి అధికంగా ఉంటే రోజూ రెండు లవంగాలు తింటే మంచిది.
• బీపీని కంట్రోల్ చేయడంతోపాటు.. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని తగ్గించేందుకు సాయపడుతుంది.
• పొట్టలో అల్సర్ సమస్యలకు లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.
• లవంగాలను రెగ్యులర్‌గా తింటే కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
• శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి, ఇవి బరువు తగ్గడానికి లవంగాలు తోడ్పటునందిస్తాయి.
• ఇందులో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి.
• వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే.. పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
• అంతేకాకుండా జీర్ణకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
• అందుకే ప్రతిరోజూ రెండు లవంగాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: