Safety Tips: మీ పిల్లలను దోమలు కుడుతున్నాయా? అయితే, ఈ చిట్కాలతో వారిని సురక్షితంగా ఉంచండి..

|

Oct 28, 2022 | 8:26 PM

సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడత ఎక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే ఆ సమస్య కాస్త తగ్గుతుంది. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా..

Safety Tips: మీ పిల్లలను దోమలు కుడుతున్నాయా? అయితే, ఈ చిట్కాలతో వారిని సురక్షితంగా ఉంచండి..
Mosquito Bites On Children
Follow us on

సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడత ఎక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే ఆ సమస్య కాస్త తగ్గుతుంది. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు పెట్రోగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు రోగాలతో సతమతం అవుతున్నారు. అటు వర్షం, ఇటు చలితో దోమలు విచ్చలవిడిగా పెరుగుతుననాయి. ముఖ్యంగా పిల్లలను దోమలు తెగ కుట్టేస్తున్నాయి. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కష్టమైన పనిగా మారింది. అయితే, దోమల నుంచి పిల్లలను కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు నిపుణులు. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చెట్ల పొదలు, నీటి నిల్వ ఉంచొద్దు..

దోమల బెడద నుంచి బయటపడాలంటే.. పిల్లిలను ఇంటికే పరిమితం చేయాలి. అలాగే, పిల్లలు నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో, చెట్ల పొదలు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలి. పాఠశాలలో కూడా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండమని చూసించాలి. అలా చేస్తే పిల్లలు దోమల బారిన పడకుండా ఉంటారు.

పూర్తి దుస్తులు..

దోమల నుంచి పిల్లలను రక్షించడానికి వారికి ఫుల్ స్లీవ్ డ్రెస్సులను వేయాలి. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు నిండైన దుస్తులు ధరించేలా చూడాలి. అలాకాకుండా, దోమల నివారణ క్రీమ్‌ను శరీరానికి అప్లై చేయొచ్చు. తద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే..

ఇంట్లోని గార్డెన్‌లో గానీ, బాల్కనీలో గానీ సిట్రోనెల్లా, పూదీనా, తులసి, లెమన్ గ్రాస్, క్యాట్నిప్ వంటి మొక్కలను నాటాలి. అలాగే, పిల్లలను దోమల నుంచి సురక్షితంగా ఉంచడానికి మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే రోల్ ఆన్ లేదా స్ప్రే రిపెల్లెంట్ ఇవ్వడం ద్వారా పిల్లలను దోమల నుండి రక్షించవచ్చు.

ఆహారం పట్ల శ్రద్ధ..

పిల్లలు తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. బలమైన రోగనిరోధక వ్యవస్థ పిల్లలను దోమల ద్వారా సంక్రమించే వ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది. నిపుణుల సలహాతో పిల్లల ఆహారంలో పెరుగు, పసుపు, వెల్లుల్లి, బచ్చలికూర, బాదం, తాజా పండ్లను ఇవ్వొచ్చు. వీటిని తినడం వల్ల పిల్లల్లో రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు పిల్లలు ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

వ్యాధుల గురించి అవగాహన..

దోమల నుండి పిల్లలను రక్షించడానికి.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక జ్వరం, వాంతులు, కంటి నొప్పి, వెన్నునొప్పి, బలహీనత, శరీరంపై ఎరుపు దద్దుర్లు డెంగ్యూ లక్షణాలుగా పరిగణిస్తారు. పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..