Brown Bread Benefits: బ్రౌన్ బ్రెడ్ ఉదయం తినొచ్చా? తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..

బ్రౌన్ బ్రెడ్.. పరిచయం అవసరం లేని పేరు. బ్రౌన్ బ్రెడ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అందరికీ తెలుసు. బ్రౌన్ బ్రెడ్‌తో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది బ్రౌన్ బ్రెడ్‌ని ఉదయం లేదా రాత్రి భోజనంలా తీసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎక్కువగా ఈ బ్రౌన్ బ్రెడ్ తింటారు. అలాగే టిఫిన్ చేయడానికి సమయం లేని వారు బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని లేదా ఇతర రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిదని..

Brown Bread Benefits: బ్రౌన్ బ్రెడ్ ఉదయం తినొచ్చా? తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..
Brown Bread

Updated on: Jan 15, 2024 | 4:19 PM

బ్రౌన్ బ్రెడ్.. పరిచయం అవసరం లేని పేరు. బ్రౌన్ బ్రెడ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అందరికీ తెలుసు. బ్రౌన్ బ్రెడ్‌తో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది బ్రౌన్ బ్రెడ్‌ని ఉదయం లేదా రాత్రి భోజనంలా తీసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎక్కువగా ఈ బ్రౌన్ బ్రెడ్ తింటారు. అలాగే టిఫిన్ చేయడానికి సమయం లేని వారు బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని లేదా ఇతర రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిదని పోషకాహార నిపుణులు సైతం వెల్లడించారు.

అయితే సమయం లేకనో లేక మంచిదనో చాలా ఉదయం బ్రౌన్ బ్రెడ్ తింటూ ఉంటారు. ఉదయం తీసుకునే అల్పహారం హెల్దీగా ఉండాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా బ్రౌన్ బ్రెడ్ తినొచ్చా? తింటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.

బ్రౌన్ బ్రెడ్‌లో పోషకాలు:

బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, కార్బోహైడ్రేట్స్, సోడియం, కేలరీస్ వంటివి ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు.

ఇవి కూడా చదవండి

బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల ప్రయోజనాలు:

1. బ్రౌన్ బ్రెడ్ తింటే ఒత్తిడి సమస్య తగ్గుతుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీని వల్ల సంతోషంగా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక భయం ఉన్నవాళ్లు బ్రౌన్ తింటే బెటర్.

2. మల్టీ గ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ తింటే ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

3. వెయిట్ తగ్గాలి అనుకునే వారు కూడా హ్యాపీగా బ్రౌన్ బ్రెడ్ తినొచ్చు. బ్రౌన్ బ్రెడ్ తింటే జీర్ణ సమస్యలు కూడా ఉండవు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

4. మట్లీ బ్రెయిన్ బ్రెడ్‌లో ప్యుతోన్యూట్రియన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తుంది. దీని కారణంగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

ఎలా తీసుకోవాలి..

బ్రౌన్ బ్రెడ్ తినాలి అనుకునే వారు పోషకాలు ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవాలి. గుడ్డు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, మిల్క్, నట్స్ బటర్ వంటి వాటితో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.