AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes-Egg: డయాబెటిక్ బాధితులలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..

డయాబెటిక్ రోగులకు గుడ్డు అనుకూలంగా ఉందా ఉంటుందా? అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం, డయాబెటిక్ రోగులు గుడ్లు తినవచ్చని తేలింది. ఇందులో నిజం ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

Diabetes-Egg: డయాబెటిక్ బాధితులలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..
వారి ప్రకారం కొన్ని రకాల వ్యాధులలో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలా మంది ప్రజలు చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు తింటారు. కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా తలెత్తుతుంది.
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2023 | 6:03 AM

Share

డయాబెటిక్ రోగులు సాధారణ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడం, ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. డయాబెటిక్ రోగుల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, అటువంటి పరిస్థితిలో వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇటువంటి ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.. ఇవి తగినంత పోషకాలను కలిగి ఉంటాయి. మధుమేహాన్ని కూడా నియంత్రించగలవు.

చలికాలంలో గుడ్డు ఒక సూపర్‌ఫుడ్‌, ప్రజలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ప్రజలు గుడ్లను ఉడకబెట్టడం ద్వారా, ఆమ్లెట్ రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఈ సూపర్ ఫుడ్స్ తినవచ్చా అనే ప్రశ్న తలెత్తుతోంది. గుడ్డు రక్తంలో చక్కెరను నియంత్రించగలదా? డయాబెటిక్ రోగులు గుడ్లు తినాలా వద్దా వైద్యులు ఏ మంటున్నారో తెలుసుకుందాం. గుడ్లు డయాబెటిక్ పేషెంట్లలో కొలెస్ట్రాల్‌ను పెంచగలవా?

డయాబెటిక్ రోగులకు గుడ్డు అనుకూలంగా ఉందా.. 

అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం, గుడ్డు ప్రోటీన్ ఉత్తమ మూలం, దీని ప్రకారం డయాబెటిక్ రోగులు గుడ్లు తినవచ్చు. కానీ మరొక అధ్యయనంలో, గుడ్లు డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెరను పెంచుతాయని చెప్పబడింది. ఈ పరిశోధన ప్రకారం, గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ కంటెంట్ సమస్యలను సృష్టిస్తుంది. మన శరీరంలోని 75% కొలెస్ట్రాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది, మిగిలిన 25% ఆహారం నుండి వస్తుంది.

సైన్స్ ప్రకారం, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, బయోటిన్, పొటాషియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తి కలిగి ఉంటుంది. గుడ్డు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది, మెదడు పనితీరును సరిచేస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. గుడ్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుడ్లు ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. గుడ్డు తీసుకోవడం డయాబెటిక్ పేషెంట్లలో ఇన్సులిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

గుడ్డు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదా? 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుడ్ల వినియోగం మధుమేహ రోగులకు గొప్పగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా, రోజంతా రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది, ఇది డయాబెటిస్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న గుడ్లను తీసుకుంటే, రోగులు గుడ్ల వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 300 MG కొలెస్ట్రాల్ తీసుకోవాలి, అయితే గుడ్డు నుండి మనకు 186 MG కొలెస్ట్రాల్ మాత్రమే లభిస్తుంది. మీరు రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర గుడ్లు తింటే, మీరు మొత్తం రోజులో 300mg కొలెస్ట్రాల్ పొందుతారు. గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ అద్భుతమైన మూలం. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే గుడ్లు తినవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Follow Us
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్