Coffee: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలు కాఫీ తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

|

Aug 29, 2022 | 4:48 PM

కానీ చిన్న పిల్లలకు, యుక్తవయసులో ఉన్న పిల్లలకు పలు విషయాలపై వివరించడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో మనం ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు.. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో..

Coffee: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలు కాఫీ తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Coffee
Follow us on

Coffee and Caffeine Bad for Kids?: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే పిల్లల ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ముఖ్యంగా ఆహారం, పోషకాల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ చిన్న పిల్లలకు, యుక్తవయసులో ఉన్న పిల్లలకు పలు విషయాలపై వివరించడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో మనం ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో.. వారిని ఆపడం చాలా కష్టం అవుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సులోనే కాఫీ తాగడం ప్రారంభిస్తారు. ఇది పిల్లలకు మంచిదేనా..? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే విషయాలను పట్టించుకోరు.. అయితే.. చిన్న పిల్లలు కాఫీ తాగితే.. మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణులు  ఏమంటున్నారంటే..?

కెఫిన్ ఉన్న పదార్థాలు పిల్లలకు లేదా పెరుగుతున్న వయస్సు పిల్లలకు ప్రయోజనకరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాఫీ అయినా, టీ అయినా.. రెండూ ఆరోగ్యానికి బదులు హాని కలిగిస్తాయని అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు ఇవి ఇవ్వడం వల్ల వారి శరీరంలో చాలా సమస్యలు రావచ్చు. అయితే కొంత వరకు పిల్లలకు కెఫిన్ ఉన్నవాటిని ఇవ్వవచ్చు.. ఎందుకంటే ఇది వారి మనస్సును చురుకుగా ఉంచుతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ.. సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే మేలు.

ఇవి కూడా చదవండి

పిల్లలకు కెఫిన్ ఎంత అవసరం?

కాఫీ పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుందనే భ్రమ చాలా మందికి ఉంటుంది. కానీ వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు 100 మి.గ్రా కెఫిన్.. అంటే 1 నుంచి 2 కప్పుల కాఫీ ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కంటే ఎక్కువ కెఫిన్ వారి శరీరానికి హాని కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..