అన్ని రకాల కూరగాయలు తినడం శరీరానికి మంచిది. ముఖ్యంగా ఎండ కాలంలో చలువ ఉండే కూరగాయలు తీసుకోవాలి. చలువ ఉండే కూరగాయల్లో సొరకాయ(bottle gourd)ఒకటి. దీనిని వండుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ(Vitamin A), కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్(Fiber) అధిక ఉండడం వల్ల శరీరానికి మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. సొరకాయ తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి.
సొరకాయ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్, పొట్టలో సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వేసవిలో సొరకాయ వినియోగం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. సొరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరతను తగ్గించి.. డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుందట. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందని నిపుణలు పేర్కొంటున్నారు. సొరకాయ తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గొచ్చట. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
Note: ఈ కథనం కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…