Health News: మారిన జీవనశైలి చెడు ఆహారపు అలవాట్ల వల్ల హైపర్ టెన్షన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. వైద్యుల ప్రకారం అధిక రక్తపోటు కేసులు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. దీనికి కారణం ప్రజలకి దీనిపై అవగాహన లేకపోవడమే. దీని కారణంగా గుండె, మూత్రపిండాల వ్యాధులు సంభవిస్తాయి. ఈ పరిస్థితిలో రక్తపోటును తనిఖీ చేయడానికి ప్రజలు సరైన సమాచారాన్ని కలిగి ఉండటం అవసరం. చాలా సార్లు రోగులు బీపీని పరీక్షించడంలో పొరపాటు చేస్తారు. రక్తపోటుని చాలా నెమ్మదిగా తనిఖీ చేయాలి. కనీసం మూడుసార్లు చెక్ చేసి సరైన నిర్ధారణకి రావాలి. బీపీ 120/70 నుంచి 130/80 ఉంటే బీపీ నార్మల్‌గా ఉందని అర్థం. రక్తపోటు 130/80 కంటే ఎక్కువగా ఉంటే ప్రీ-హైపర్‌టెన్షన్ అంటారు. రీడింగ్ 180/110 mm Hg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, గుండె సమస్యల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని గుర్తుంచుకోండి.
డాక్టర్ ప్రకారం.. రక్తపోటును గుర్తించిన తర్వాత గుండెని పరీక్షించాలి. దీనివల్ల భవిష్యత్‌లో జరిగే నష్టాన్ని నివారించవచ్చు. ఒకవేళ హైపర్ టెన్షన్ ప్రభావం గుండెపై కనిపిస్తే వెంటనే చికిత్సను ప్రారంభిస్తారు. అధిక రక్తపోటును నియంత్రించడానికి జీవనశైలిని సరిదిద్దడం ముఖ్యం. అలాగే రోజూ కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల హై బీపీ రిస్క్ తగ్గుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే దాని వినియోగాన్ని తగ్గించండి. యోగా, ధ్యానం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి