Black Salt: బ్లాక్ సాల్ట్‌తో ఆ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చు.. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే అమేజింగ్ బెనిఫిట్స్

|

Aug 25, 2022 | 9:22 AM

నల్ల ఉప్పును మలబద్ధకం, గ్యాస్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది యాంటీఆక్సిడెంట్లకు ఉత్తమ మూలం.

Black Salt: బ్లాక్ సాల్ట్‌తో ఆ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చు.. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే అమేజింగ్ బెనిఫిట్స్
Black Salt
Follow us on

Black Salt Health Benefits: వంటగదిలో ఉండే పలు పదార్థాలతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాంటి వాటిలో బ్లాక్ సాల్ట్ (రాక్ సాల్ట్) ఒకటి. ఉప్పు ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరుకుతుంది. కానీ, నల్ల ఉప్పును కొంతమందే వినియోగిస్తారు. నల్ల ఉప్పును ఆయుర్వేద ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. దీని వినియోగం మన ఆరోగ్యానికి, అందానికి ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. నల్ల ఉప్పును మలబద్ధకం, గ్యాస్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది యాంటీఆక్సిడెంట్లకు ఉత్తమ మూలం. దీని వినియోగం ద్వారా గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటును నియంత్రించవచ్చు. ఇంకా మరెన్నో సమస్యలను కూడా సులభంగా అధిగమించవచ్చు. నల్ల ఉప్పును రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిమ్మిరి నుంచి ఉపశమనం: బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల నొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పును పోషకాల పవర్‌హౌస్‌గా కూడా పిలుస్తారు. మీరు దీన్ని తిన్న తర్వాత ఇది శరీరంలోకి వెళ్లి నిర్విషీకరణకు పనిచేస్తుంది. దీనితో పాటు శరీరం నుంచి విషాన్ని తొలగించే వాటిలో బ్లాక్ సాల్ట్‌ను అత్యంత దివ్యౌషధంగా పరిగణిస్తారు.

బెస్ట్ స్క్రబ్ : బ్లాక్ సాల్ట్ కేవలం ఆహారానికి మాత్రమే కాదు. మీ మెడ నల్లగా ఉన్నా, చర్మవ్యాధి ఉన్నా వాటి నివారణకు మంచిగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో నల్ల ఉప్పు కలపి.. ఆ తర్వాత స్నానం చేస్తే శరీరానికి మేలు జరుగుతుంది. ఇది సహజమైన స్క్రబ్‌గా ఉత్తమంగా పనిచేస్తుంది. ఉప్పు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఇది ముఖం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

జుట్టుకు ప్రయోజనం: ఇటీవల కాలంలో జుట్టు రాలడం లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే బ్లాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నల్ల ఉప్పు డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. దీని ఉపయోగం జుట్టు అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు బలహీనమైన జుట్టును బలోపేతం చేస్తాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..