వైద్యులు, నిపుణులు దానిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరంలోనే ఉంటుంది. కానీ బయట పడదు. కానీ చేయాల్సిన నష్టాన్ని నెమ్మదిగా చేసేస్తోంది. చివరికి మనిషి ప్రాణాన్ని హరించేస్తుంది. అదే హైపర్ టెన్షన్(రక్తపోటు). చాలా సందర్భాల్లో స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ కేవలం ఈ హై బీపీ వల్లే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దీర్ఘకాలంలో ఇది పలు కార్డియో వాస్కులర్ వ్యాధులకు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, డిమెన్షియా వంటి వ్యాధులకు ఇది కారణమవుతుంది. దీనిలో మరో ప్రమాదకర అంశం ఏమిటంటే హై బీపీని కలిగి ఉన్న వారికి అది ఉన్నట్లు అసలు తెలీదు. ఎందుకంటే ఎటువంటి లక్షణాలను ఇది చూపదు. కొందరిలో పరీక్ష చేస్తే గానీ బయటకు రాదు. అందుకే హై బీపీ విషయంలో జాగ్రత్తలు వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి? చికిత్స విధానాలు ఏమిటి తెలుసుకుందాం రండి..
హై బ్లడ్ ప్రెజర్ వల్ల ఆకస్మికంగా ఏర్పడే గుండెపోటులు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో పాటు అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అవేంటంటే..
హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, మైక్రో వాస్కూలర్ డిసీజ్, ఫెరిఫెరీ ఆర్టరీ డిసీజ్, పర్మనెంట్ లాస్ ఆఫ్ విజన్, సెక్యువల్ డిస్ ఫంక్షన్,
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు, దాదాపు 100 మిలియన్లకు పైగా అడల్ట్స్ ఈ హై బ్లడ్ ప్రజెర్తో బాధపడతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సగం మంది మాత్రమే ముందుగా దానిని గుర్తించి, అదుపులో ఉంచుకుంటున్నారు. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం 30ఏళ్లు లేదా 40 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఇది ప్రధానంగా అనారోగ్యకరమైన జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగానే వస్తుందని చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..