
కివీలో పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది. ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు దీన్ని ధైర్యంగా తినవచ్చు.
పుచ్చకాయ వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే మంచి పండు. ఇందులో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేడి కాలంలో ఇది మన శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది. ఇందులో చక్కెర తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది మంచి ఎంపిక.
బ్లూ బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉండటం వల్ల షుగర్ నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. ఇది రక్తంలోని షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
స్ట్రాబెర్రీ పండ్లు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల షుగర్ పెరగదు. వేసవి కాలంలో వీటిని కొద్దిగా తినడం వల్ల మన శరీరం శక్తివంతంగా ఉంటుంది.
ప్లమ్ అనే పండులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం తిన్నది బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇందులో చక్కెర తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. వేసవిలో ఇది మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండు.
నారింజ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో చక్కెర తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు దీన్ని కొద్దిగా తినవచ్చు. వేసవిలో ఇది మన శరీరానికి తేమను అందిస్తుంది.
వేసవి రోజుల్లో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎంచుకునే పండ్లలో చక్కెర తక్కువగా ఉండాలి. ఇవి షుగర్ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా వేడి నుంచి ఉపశమనం కలిగించి మన శరీరానికి నీటిని కూడా అందిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)