Banana Stem Benefits: అరటి కాండం తింటే మీరు నమ్మలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగ పడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పలు రకాల అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయి. అదే విధంగా అరటి కాండంతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ అరటి కాండాన్ని ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు..

Banana Stem Benefits: అరటి కాండం తింటే మీరు నమ్మలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
Banana Stem

Updated on: Feb 06, 2024 | 5:06 PM

అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగ పడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పలు రకాల అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయి. అదే విధంగా అరటి కాండంతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ అరటి కాండాన్ని ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు అరటి కాండం తింటే చాలా మంచిది. ఇందులో ఫైబర్ శాతం మెండుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేగుల్లో పేరుకునిపోయిన వ్యర్థాలను, మలినాలను బయటకు పంపుతుంది. అరటి కాండం తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు చూద్దాం.

నరాల సమస్యలు అదుపు అవుతాయి:

అరటి కాండం తినడం వల్ల నరాల సమస్యలు అదుపులోకి వస్తాయి. నరాల సమస్యలతో బాధ పడే వారు అరటి కాండం రసాన్ని తరచూ తాగాలి. ఇలా తాగితే నరాల సమస్యలు అదుపు అవుతాయి. అదే విధంగా పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారు కూడా అరటి కాండం రసం తాగితే చాలా బెటర్‌గా పని చేస్తుంది.

రక్తం శుద్ది అవుతుంది:

బ్లడ్ ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో బాధ పడేవారు అరటి కాండం సూప్ తాగితే.. రక్తం శుద్ధి అవుతుంది. దాహం అతిగా వేసేవారు కూడా అరటి కాండం చూర్ణం లేదా రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి:

కాలిన గాయాలు ఎక్కువ కాలం తగ్గవు. అలాంటి వారు అరటి కాడను కాల్చి.. బుడితను కొబ్బరి నూనెతో కలిపి రాస్తే.. ఎలాంటి కాలిన గాయాలైనా త్వరగా నయం అవుతాయి. అలాగే కామెర్లు ఉన్నవారు.. అరటి కాండాన్ని ఎండలో బాగా ఆర బెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో రోజూ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే కామెర్లు తగ్గిపోతాయి.

రుతుక్రమంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి:

నెలసరి సమయంలో మహిళలు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు అరటి కాండంతో మంచి పరిష్కారాలు దొరుకుతాయి. అరటి కాండం రసం లేదా అరటి పువ్వు రసాన్ని తాగాలి. అరటి రసంలో ఆస్ట్రింజెంట్ ఉంది. నేరుగా తాగలేని వారు బెల్లం మాత్రమే కలుపుకుని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.