Foods Causing Gas: తిన్నది జీర్ణం కావడం లేదా.. అయితే ఈ పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్..

తినే ఆహారం జీర్ణం కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కొందరు కొన్ని పదార్థాలకు దూరంగా కూడా ఉంటారు. సమయానికి జీర్ణం కాకపోవడంతో శరీరంలో గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. మనం తినే ఆహార పదార్థాల్లో..

Foods Causing Gas: తిన్నది జీర్ణం కావడం లేదా.. అయితే ఈ పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్..
అల్లం నీరు: అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అల్లం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య దూరం అవుతుంది. అల్లం నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

Updated on: Oct 30, 2022 | 2:01 PM

తినే ఆహారం జీర్ణం కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కొందరు కొన్ని పదార్థాలకు దూరంగా కూడా ఉంటారు. సమయానికి జీర్ణం కాకపోవడంతో శరీరంలో గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. మనం తినే ఆహార పదార్థాల్లో కొన్నింటి వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. తినే ఆహారం జీర్ణం కాకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో గ్యాస్‌ను ఫామ్ చేసే, జీర్ణ సమస్యలను కలిగించే ఆహారాలు ఎక్కువుగా ఉన్నాయి. అందరికీ కాకపోయినా.. కొందరికి ఈ సమస్య కచ్చితంగా ఉంటుంది. పైగా ఈ ఆహారాలు సురక్షితమైనవిగా భావించి తీసుకుంటారు చాలా మంది. కాని ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ ఆహారాల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు. వేయించిన ఆహారం జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఆ పదార్థాలు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. దీంతో గ్యాస్‌, గుండెల్లో మంట సమస్య పెరుగుతోంది. అందుకే అలాంటి పదార్థాలను ప్రారంభంలోనే గుర్తించి.. దూరంగా పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణ సమస్య ఏర్పడుతుందో తెలుసుకుందాం. వంకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో పెద్ద పరిమాణంలో వాటిని తిన్నప్పుడు గ్యాస్‌ను కలిగిస్తుంది.

గుండెల్లో మంట కూడా రావచ్చంటున్నారు వైద్య నిపుణులు. గోధుమ పిండిని జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ వేగవంతం కావాలి. ఫలితంగా దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దోసకాయలో కుకుర్బిటాసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది అజీర్తిని కలిగిస్తుంది. క్యాబేజీ కూడా గ్యాస్‌కు కారణమవుతుంది. అయితే వ్యక్తి తీసుకునే ఆహారం నుంచి క్యాబేజీని తొలగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. క్యాబేజీలో చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నాయి. ఇవి తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీ వలె కాలీఫ్లవర్‌లో కూడా సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని గ్లూకోసినోలేట్స్ అంటారు. ఇది అపానవాయువుకు కూడా కారణమవుతుంది. అంతేకాకుండా, గుండెల్లో మంటకు కారణం కావచ్చు.

సోయాబీన్స్ శరీరంలో అదనపు కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా గుండెల్లో మంట సమస్య మరింత పెరుగే అవకాశాలున్నాయి. తక్కువ మొత్తంలో ఈస్ట్ శరీరానికి ఆరోగ్యకరం అయినప్పటికీ.. అధిక మొత్తంలో తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, నోటిపూత, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతమందికి పాలు జీర్ణం కావు. జీర్ణ సమస్యలు ఉంటే వారు పాలు లేదా పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. లేకుంటే గ్యాస్, హార్ట్ బర్న్ సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. జీర్ణం సమస్యతో బాధపడుతున్న వారు పై ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..