కొంత మంది హెవీ వెయిట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఓలాగైనా బరువు తగ్గాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. చివరికి వెయిట్ లాస్ కోసం వ్యాయమం చేయడంతో పాటు డైటింగ్ చేస్తారు. ఈ డైటింగ్ లో చాలా మంది తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. డైటీషియన్స్ సలహా లేకుండా కొంతమంది సొంత డైట్ ప్లాన్ ఫాలో అవుతుంటారు. వీరిలో ఎక్కువ మందిలో రిజల్ట్ కనిపిస్తుంది కూడా. మరికొంత మంది ఫలితం లేకపోవడంతో బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా డైట్ ప్లాన్ లో ఎన్నో మార్పులు చేసుకుని.. వెయిట్ లాస్ కోసం నెలల తరబడి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంతమందికి ఫలితం వచ్చినా.. మరికొంతమందికి ఫలితం కన్పించదు. వెయిట్ లాస్ కోసం మరికొంతమంది హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటం లేదా.. వివిధ కోర్సులు తీసుకుని ఫాలో అవడం చూస్తుంటాం. కాని మనం తీసుకునే డైట్ లో పక్కా ప్లాన్ ప్రకారం చిన్న, చిన్న మార్పులు చేసుకుంటే బరువు తగ్గాలనే మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. ఎక్కువ నూనెలో వేపిన పదార్థాలకు దూరంగా ఉండాలి. శారీరక వ్యాయమం చేసినప్పటికి.. బరువు తగ్గాలనుకునే వారు ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. తక్కువ టైంలో బరువు తగ్గాలనుకునే వారు ఈక్రింది డైట్ ప్లాన్స్ ఫాలో అయితే నెల రోజుల్లోనే ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు.
బ్రేక్ ఫాస్ట్: చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యకరమై ఫుడ్ తీసుకోవాలి. ఉదయం సమయంలో బిస్కెట్లు లేదా తీపి పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోకూడదు. అల్పాహారంగా పోహా, వెజిటేబుల్ జ్యూస్ లేదా, బాయిల్డ్ ఎగ్స్ తినాలి. లేదా ఆయిల్ తక్కువుగా ఆమ్లెట్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. కాఫీ, టీ అలవాటు ఉన్నవారు చక్కెర లేని టీ లేదా కాఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
మధ్యాహ్నం భోజనం: మధ్యాహ్నం భోజనంలో పప్పు, బ్రౌన్ రైస్, రెండు రోటీలు, సలాడ్, పెరుగు తీసుకోవాలి.
సాయంత్రం స్నాక్స్: సాయంత్రం స్నాక్స్ టైంలో సమోసాలు, న్యూడిల్స్ వంటి ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. దాల్ వడ, రోస్ట్ వేరుశెనగ, ఆమ్లెట్ ను స్నాక్స్ గా తీసుకోవచ్చు.
రాత్రి భోజనం: రాత్రి భోజనాన్ని లైట్ గా తీసుకోవాలి. వెజిటబుల్ సూప్, గంజి, కిచిడి వంటి వాటిని తినవచ్చు. ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువుగా తీసుకోకూడదు.
బ్రెక్ ఫాస్ట్: ఉదయం అల్పాహరంగా నానబెట్టిన గింజలు తినడం మంచిది. దీని తర్వాత పన్నీర్ భుర్జీ, రెండు రోటీలు తీసుకోవచ్చు. గోధుమలతో చేసిన రోటీలే కాకుండా మల్టీగ్రెయిన్ రోటీలను తినవచ్చు. దీని కోసం గోధుమ పిండికి మిల్లెట్, శనగపిండి వంటి పోషకమైన పదార్థాలను జోడించాలి.
మద్యాహ్నం భోజనం: మధ్యాహ్న భోజన సమయంలో రోటీ, కాయగూరలతో చేసిన కూర, అన్నం, సలాడ్ తీసుకోవాలి. ఇది కాకుండా పప్పును భోజనంతో తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ తినొచ్చు.
సాయంత్రం స్నాక్స్: సాయంత్రం టీ బ్రేక్ లో ఉత్తపం. సోయా చాప్ లేదా గ్రిల్డ్ పన్నీర్ తీసుకోవచ్చు.
రాత్రి భోజనం: రాత్రి భోజనంలో బ్రౌన్ రైస్ తో రాజ్మా, పెరుగు తీసుకోవడం మంచిది. సోయాబీన్ చాప్ లేదా గ్రేవీని తినవచ్చు.
పైన పేర్కొన్న డైట్ ప్లాన్స్ లో ఎవరి ఆహారపు అలవాట్లను బట్టి వారు వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వడంతో పాటు ఎక్కువుగా నీరు తాగాలి. డైట్ ప్లాన్ కరెక్ట్ గా ఫాలో అయినప్పటికి.. నీళ్ల విషయంలో చాలామంది అజాగ్రత్తగా ఉంటారు. దాహం వేసినప్పుడే కాకుండా ప్రతి గంటలకు కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు వీలైనప్పుడు తాగాలి. జ్యూస్ లు తాగాలనుకునేవారు ఇంట్లోనే ఫ్రెష్ జ్యూస్ లు తయారుచేసుకుని తాగవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..