AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఈ ఆహారాలతో తస్మాత్ జాగ్రత్త.. ఇవి ఎక్కువుగా తీసుకుంటే గుండెజబ్బులకు కారణం కావచ్చు..

ప్రస్తుతం జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే మారుతున్న లైఫ్ స్టైల్ తో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న..

Health: ఈ ఆహారాలతో తస్మాత్ జాగ్రత్త.. ఇవి ఎక్కువుగా తీసుకుంటే గుండెజబ్బులకు కారణం కావచ్చు..
Heart Attack
Amarnadh Daneti
|

Updated on: Aug 26, 2022 | 10:16 PM

Share

Health News: ప్రస్తుతం జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే మారుతున్న లైఫ్ స్టైల్ తో అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న వయసు వారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చాలా మంది గుండె పోటు కారణంగా తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో మనం తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని చెడు వ్యసనాలతో పాటు.. కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడితే గుండె సంబధిత వ్యాధుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈదశలో ఎటువంటి ఆహారాలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం..

గుండె జబ్బులు అధిక కొలెస్ట్రాల్‌తో మొదలవుతాయి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి, దీంతో రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. అధిక రక్తపోటు గుండెకు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

సిగరెట్ ,ఆల్కహాల్: సిగరెట్ ,ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు, కాలేయానికి ఎక్కువ హానిని కలిగిస్తాయి. అలాగే నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది కాబట్టి హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

కూల్ డ్రింక్స్: ఎక్కువ మంది దాహం వేసినా లేదా ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా వెంటనే మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి తరచుగా కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. అయితే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.

ఆయిల్ ఫుడ్స్: చాలా మంది ఆహార ప్రియులు, స్పైసీ, నూనె ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కానీ ఆయిల్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. ఆయిల్ ఫుడ్స్ వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ప్రాసెస్డ్ మీట్ :ప్రస్తుత బిజీ షెడ్యూల్ లో ప్రాసెస్డ్ మీట్ ట్రెండ్ బాగా పెరిగింది. తరచుగా ప్రజలు ప్రోటీన్ పొందడానికి మాంసం తింటారు, కానీ ప్రాసెస్ చేసిన మాంసాల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, గుండెపోటుకు దారితీస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు