Health benefits of barley water: అసలే ఎండాకాలం.. బయట ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు.. చాలామందిని శరీర ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా వేధిస్తుంటుంది. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు కొంతమంది పలు రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. కొంత మంది శీతల పానీయాలను తాగుతూ.. సేద తీరుతుంటే.. మరికొంతమంది వేసవి తాపం నుంచి గట్టేక్కేందుకు సహజసిద్ధమైన పద్దతులను అనుసరిస్తారు. అలాంటి సహజసిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ నీటిని నిత్యం తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. బార్లీ నీటిని ఎలా తయారు చేయాలి.. దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఒక పాత్రలో లీటర్ రెండు లీటర్ల తాగునీటిని తీసుకుని వాటిలో కొన్ని బార్లీ గింజలను వేయాలి. లేకపోతే మిక్సి పట్టి పొడిని రోజుకు కొద్దిగా వేయొచ్చు. 20 నిమిషాలపాటు ఈ నీటిని మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోయాలి. దీంతోపాటు ఉంటే.. అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరిగడుపున తాగాలి. లేదా మధ్యాహ్నం ఎండకు బయటకు వెళ్లివచ్చిన తర్వాత కూడా తాగవచ్చు.
• బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
• మూత్రాశయం శుభ్రంగా మారుతుంది.
• కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
• మూత్ర సమస్యలన్నీ తగ్గిపోతాయి.
• జీర్ణశాయ ఇబ్బందులు, ఉదర సమస్యలు తొలగిపోతాయి.
• కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
• రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది.
• బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని తాగితే బరువు తగ్గుతారు.
• బార్లీ నీటి వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
• రక్త సరఫరా మెరుగు పడుతుంది.
• వడదెబ్బ తాకకుండా ఉండాలన్నా.. ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా.. బార్లీ నీటిని తాగితే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: