Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..? అయితే మీకు దాని ప్రయోజనాలేమిటో తెలియవు.. అవి తెలిస్తే షాక్ అవుతారంతే..

మనం సాధారణంగా అరటిపండ్లను తిని, వాటి తొక్కను డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అయితే అరటి తొక్క కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? అరటి పండు మానవ అరోగ్యానికి..

Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..? అయితే మీకు దాని ప్రయోజనాలేమిటో తెలియవు.. అవి తెలిస్తే షాక్ అవుతారంతే..
Banana Peel Benefits

Updated on: Dec 05, 2022 | 3:07 PM

మనం సాధారణంగా అరటిపండ్లను తిని, వాటి తొక్కను డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అయితే అరటి తొక్క కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? అరటి పండు మానవ అరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే నిజానికి, అరటి తొక్క కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా చర్మానికి దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అరటి తొక్కలో విటమిన్ B6, B12, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అరటి తొక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

మొటిమలను వదిలించుకోవడం:  అరటి తొక్కలో ఉండే కొన్ని ప్రత్యేక పదార్థాలు మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయని ఒక పరిశోధనలో తేలింది. మొటిమలను వదిలించుకోవడానికి, రాత్రంతా మొటిమలపై అరటి తొక్కలోని ఒక చిన్న భాగాన్ని ఉంచండి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మొటిమలు క్రమంగా మాయమవడం ప్రారంభమవుతుంది. అరటి తొక్కకు యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను ఇవి నాశనం చేయడం ద్వారా చర్మాన్ని రిపేర్ చేస్తాయి. అరటిపండు తొక్కను గ్రైండ్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. కావాలంటే తొక్కను నేరుగా చర్మంపై రాసుకుని వాడుకోవచ్చు.

శరీర ముడతలు: అరటి తొక్క శరీర ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలో కొల్లాజెన్‌ని పెంచే మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇంకా తేమను లాక్ చేస్తుంది. వీటిని రోజూ ముఖానికి రాసుకుంటే ముడతలు క్రమక్రమంగా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

UV కిరణాల నుంచి రక్షణ: అరటి తొక్కలు UV కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. అరటిపండు తొక్కలలో ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.

దంత సమస్యలు: దంతాలు పసుపు రంగులోకి మారినట్లయితే, రోజూ అరటిపండు తొక్కను దంతాలపై రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. అరటి తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు మెరుస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం